Sachin Tendulkar: దేశవాళీ టోర్నమెంట్ లలో కీలక ఆటగాళ్లు ఆడకపోవడంతో బీసీసీఐ ఆగ్రహంగా ఉంది. గతంలో ఎన్ని మార్లు లేఖలు రాసినా వారు స్పందించకపోవడంతో చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా స్పెషల్ కాంట్రాక్ట్ నుంచి ఇషాన్ కిషన్(Ishan Kishan), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ను బీసీసీఐ (BCCI) తొలగించింది. దీనిపై సీనియర్ క్రికెటర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు బిసిసిఐ నిర్ణయాన్ని సమర్థిస్తే.. మరికొందరు అయ్యర్, కిషన్ ను వెనకేసుకొచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా చేరాడు. స్పెషల్ కాంట్రాక్ట్ నుంచి కొంతమంది స్పెషల్ కాంట్రాక్ట్ నుంచి కొంతమంది ఆటగాళ్లను బీసీసీఐ తొలగించడం పట్ల స్పందించారు.
దేశవాళీ టోర్నీలకు బీసీసీఐ కల్పిస్తున్న ప్రాధాన్యాన్ని సచిన్ అభినందించారు. ” నేను టీమిండియా కు ఆడుతున్నప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా ముంబై తరఫున ఆడేవాన్ని. అప్పటి డ్రెస్సింగ్ రూమ్ లో ఏడు నుంచి ఎనిమిది మంది జాతీయ ఆటగాళ్లు ఉండేవాళ్లు. వారితో ఆడటం సరికొత్త అనుభూతిని ఇచ్చేది. అలాంటి టోర్నీలు ఆడినప్పుడే ఆటగాళ్ళలో ప్రతిభ బయటపడుతుంది. సరికొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఆటలో మెళకువలు అలవడతాయని” ట్విట్టర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. “స్టార్ ఆటగాళ్లు టీమిండియా కు ఎలాగూ ప్రాతినిధ్యం వహిస్తారు. దేశవాలి టోర్నమెంట్లలో ఆడినప్పుడు వారికి ప్రేక్షకుల నుంచి మరింత మద్దతు లభిస్తుంది. అభిమానులు కూడా వారు ఆడే విధానం పట్ల మరింత ప్రేమను చూపుతారు. దేశవాళి క్రికెట్ కు బీసీసీఐ ప్రాధాన్యం ఇవ్వడం అద్భుతంగా ఉందని” సచిన్ పేర్కొన్నాడు.
గతంలో ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్ లు ఆడేవాళ్లు. జాతీయ జట్టులో ఆడుతున్నప్పుడు అంచనాలు అందుకోలేని సమయంలో రంజిలో ఆడేవాళ్లు. అప్పట్లో బీసీసీఐ నిబంధనలు కూడా అలాగే ఉండేవి. ఇప్పటికీ ఆ నిబంధనలు అలాగే ఉన్నప్పటికీ.. క్రికెట్ లో కార్పొరేట్ శక్తులు ప్రవేశించడం.. ఆటగాళ్లకు అవకాశాలు పెరగడంతో దేశవాళీ టోర్నీలలో ఆడటం లేదు. నిబంధనలను ఉల్లంఘించిన అయ్యర్, కిషన్ పై బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది.
The Ranji Trophy semi-finals have been riveting! @MumbaiCricAssoc’s march into the finals was aided by a brilliant batting recovery, while the other semi-final hangs in the balance going into the last day – Madhya Pradesh need 90+ runs to win, Vidarbha need 4 wickets.…
— Sachin Tendulkar (@sachin_rt) March 5, 2024