Sehwag on 2003 WC match : సమకాలీన క్రికెట్ లో టీమిండియాకు ఆడిన అందరిలోకి డేరింగ్ డ్యాషింగ్ ఓపెనింగ్ జోడి ఎవరిదని అంటే అది ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్ దే.. గొప్ప ఓపెనర్‌లలో ఒకరైన వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పుడూ తన మనసులోని మాటను దాచుకోడు. ఓపెన్ గా చెప్పే వ్యక్తిగా పేరు పొందాడు. సెహ్వాగ్ ఎప్పుడూ మైదానంలో.. వెలుపల నిర్భయంగా ఉంటాడు. అతను అతను ఎటువంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తాడు. ఇది భారత జట్టులో జరిగిన ఆసక్తికర విషయాలను బయటపెడుతుంటాయి. తాజాగా అభిమానులకు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

వీరేంద్ర సెహ్వాగ్ లెఫ్టార్మ్ పేసర్‌ల బౌలింగ్ లో తడబడుతుంటాడు. సరిగ్గా ఆడలేడు. వారి తొలి ఓవర్లలోనే ఔట్ కావడం అలవాటు చేసుకున్నాడు. ఆ బలహీనత బాగా ఉండేది. ఇటీవల దాన్ని ఒప్పుకున్నాడు. అందుకే తన ఓపెనింగ్ భాగస్వామి సచిన్ టెండూల్కర్‌ను ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్లు మొదట బౌలింగ్ చేస్తే.. మొదట స్ట్రైక్ చేయాలని ఎల్లప్పుడూ కోరుతుంటాడు. సెహ్వాగ్ అలా చేయకపోవడానికి కారణాలు ఉన్నాయి.
2003 ప్రపంచకప్‌లో ‘సుల్తాన్ ఆఫ్ స్వింగ్’ గా పేర్కొనే పాకిస్థాన్‌కు చెందిన దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ ఫస్ట్ ఓవర్ వేయడానికి రెడీ అయ్యాడు. ఈ టైంలో సెహ్వాగ్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సందర్భంగా సెహ్వాగ్ దీన్ని బయటపెట్టాడు.
తొలి ఓవర్ లో స్ట్రైక్ తీసుకోవాలని సచిన్ ను కోరారు. శ్రీలంకతో మ్యాచ్ లో లెఫ్టార్మ్ పేసర్ చమిందా వాస్, అసీస్ లెఫ్మార్మ్ బౌలర్ నాథన్ బ్రాకెన్ బౌలింగ్ లో చాలాసార్లు అవుట్ అయ్యాను. ఇప్పుడు వసీం అక్రమ్ చేతిలోనూ తొలి బంతికే ఔట్ అవుతా.. ప్లీస్ ఈ ఒక్క సారి నువ్వే స్ట్రైక్ తీసుకో’ అని సచిన్ ను కోరాడట సెహ్వాగ్. అయితే దానికి సచిన్.. ‘లేదు.. ఒప్పుకోను.. కొన్ని నమ్మకాలను నేను నమ్ముతాను. తన పండిట్ జీ నన్ను రెండోస్థానంలోనే బ్యాటింగ్ చేయమని చెప్పాడు’ అని బదులిచ్చాడు.
దానికి నేను ‘నువ్వు ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాటర్ వి సచిన్.. అలాంటిది నువ్వు పండిట్ జీ చెప్పింది నమ్ముతావా?’ అని ప్రశ్నించాను. దానికి సచిన్ ‘నో వే నేను 2వ స్తానంలోనే బ్యాటింగ్ చేస్తాను. నువ్వు తొలి బంతిని ఎదుర్కో’ అంటూ చెప్పాడు. కానీ మైదానంలోకి వెళ్లాక సచిన్ నే స్ట్రైక్ తీసుకొని తొలి బంతిని ఎదుర్కొని సెహ్వాగ్ ను ఆశ్చర్యపరిచాడు. ఆరోజు సచిన్ తనను బతికించాడని.. కానీ తనను అలా ఆటపట్టించడానికి చాలా సేపు భయపెట్టాడని సెహ్వాగ్ నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు.
2003 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. వరల్డ్ కప్ లో భారత్ పై ఇదే అత్యధిక స్కోరు. ఆ తర్వాత సచిన్ 98, యువరాజ్ 50, రాహుల్ ద్రావిడ్ 44 పరుగులు చేసి రాణించడంతో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది.