SA20 League: 2007లో టి20 వరల్డ్ కప్ నిర్వహించినప్పుడు.. ఇంగ్లాండ్ జట్టు మీద టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలన బ్యాటింగ్ చేశాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు..బ్రాడ్ కు జీవిత కాలం దుఃఖాన్ని మిగిల్చాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అద్భుతమైన రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆ రికార్డును ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేకపోయాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా సౌత్ ఆఫ్రికా ట్వంటీ లీగ్ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్ లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్, MI కేప్ టౌన్ జట్లు తలపడ్డాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్రేవిస్ 13 బంతుల్లోనే 36 పరుగులు తీశాడు. రూథర్‌ఫోర్డ్ 15 బందులో 47 పరుగులు సాధించాడు. విహాన్ 36 బంతుల్లో 60 పరుగులు చేశాడు. హోప్ 30 బంతుల్లో 45 పరుగులు చేశాడు. రూథర్‌ఫర్డ్, బ్రేవిస్ ఆరో వికెట్ కు అజేయంగా 27 బంతుల్లో 86 పరుగులు చేయడం విశేషం.
రూథర్‌ఫోర్డ్, బ్రేవిస్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించారు. ప్రిటోరియా ఇన్నింగ్స్ 18 వ ఓవర్లు ఐదు, ఆరు బంతులలో బ్రేవిస్ రెండు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లలో రూథర్ ఫోర్డ్ తొలి నాలుగు బంతులను స్టాండ్ అవతలికి పంపించాడు. తద్వారా కార్బన్తులు ఆరు సిక్సర్లు నమోదు అయ్యాయి. ఆ తర్వాత ఎం ఐ కేప్ టౌన్ జట్టు 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. 14.2 ఓవర్లలో ఆల్ అవుట్ అయింది. బ్యాటింగ్ ద్వారా అదరగొట్టిన రూథర్‌ఫోర్డ్.. బౌలింగ్‌లో కూడా దుమ్మురేపాడు. ఏకంగా నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఎం ఐ కేప్ టౌన్ జట్టులో రికెల్టన్ 33 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ప్రిటోరియ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో 17వ ఓవర్ లో 11, 18వ ఓవర్లో 21, 19వ ఓవర్లో 26, 20వ ఓవర్లో 25 పరుగులు చేశారు బ్రేవిస్, రూథర్ ఫోర్డ్.
SIX SIXES IN A ROW
Pretoria Capitals have smashed six sixes off six balls against MI Cape Town in the #SA20
17.5 – SIX
17.6 – SIX
18.1 – SIX
18.2 – SIX
18.3 – SIX
18.4 – SIXThis is breathtaking stuff from Dewald Brevis and Sherfane Rutherford pic.twitter.com/Mjh8SYxSMY
— Cricbuzz (@cricbuzz) December 31, 2025