Sa Vs Nz Semi Final 2025
Sa Vs Nz Semi Final 2025: క్రికెట్ లో కొన్ని జట్లు పేర్లు ప్రస్తావనకు వస్తే మన మదిలో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆస్ట్రేలియా అయితే మోస్ట్ విన్నింగ్ జట్టుగా.. టీమిండియా అయితే మోస్ట్ ఫైటర్ జట్టుగా.. ఇంగ్లాండ్ అయితే క్రికెట్ ఓన్ కంట్రీగా.. వెస్టిండీస్ అయితే మోస్ట్ డేంజరస్ టీమ్ గా.. స్ఫురణ లోకి వస్తాయి. కానీ అదే దక్షిణాఫ్రికా పేరు ప్రస్తావనకు వస్తే మోస్ట్ అన్ లక్కీ టీం అనే మాట మన మైండ్ లోకి ఎక్కుతుంది. ఆ జట్టులో బౌలింగ్ కు కొదవ ఉండదు. బ్యాటింగ్ చేసే వాళ్లకు లోటు ఉండదు. ఇక ఫీల్డింగ్ విషయంలో వాళ్ళు నెలకొల్పే ప్రమాణాలకు కొలమానం ఉండదు. కానీ అటువంటి ఆటగాళ్లు ఐసీసీ మేజర్ టోర్నీలలో చతికిల పడుతుంటారు. 1999లో ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ టోర్నీగా ఉన్నప్పుడు.. దక్షిణాఫ్రికా గెలిచింది. నాడు దక్షిణాఫ్రికాలో గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టును ఓడించి విజయం సాధించారు.. కానీ ఆ తర్వాత దక్షిణాఫ్రికా మరోసారి ఐసీసీ టోర్నీని గెలుచుకోలేకపోయింది. అంతేకాదు ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ చేతిలో వన్డే సిరీస్ ను కూడా కోల్పోయే స్థితికి దిగజారింది. ఇక చాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ వెళ్లిన దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2023 వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టును ఓడించిన దక్షిణాఫ్రికా.. ఇప్పుడు మాత్రం ఓటమిపాలైంది.
Also Read: డియర్ మిల్లర్.. కివీస్ గెలిచినా.. చివరి 25 బంతుల్లో నీ ఆటకు హాట్సాఫ్ అంతే..
ఐదుసార్లు వరుస ఓటములు
ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో వరుసగా ఓడిపోయి.. అత్యంత దురదృష్టకరమైన జట్టుగా దక్షిణాఫ్రికా పేరుపొందింది. 2014లో టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఆ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా (వర్షం వల్ల మ్యాచ్ 43 ఓవర్లకు కుదించారు) 281 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని న్యూజిలాండ్ 42.1 ఓవర్లలో చేదించింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది . 2023 వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 212 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా విధించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. టీమిండియా తో తలపడిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.. ఇక ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో సెమి ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 362 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొత్తంగా ఐదు ఐసీసీ మేజర్ టోర్నీలలో దక్షిణాఫ్రికా ఓటమి పాలు కావడంతో.. ఆ జట్టు పై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.