Ruturaj Gaikwad performance analysis: బాహుబలి సినిమా చూశారా.. అందులో సుబ్బరాజు పరమ భయస్తుడు. యుద్ధం చేయలేడు. కాకపోతే రాజుగా వైభోగాలు అనుభవిస్తుంటాడు. అనుష్క ప్రత్యర్థులతో యుద్ధం చేస్తుంటే.. తను మాత్రం ప్రాణ రక్షణ కోసం తాపత్రయపడుతుంటాడు. చుట్టూ రాజ్యంలో ఉన్న భటులను రక్షణగా ఉంచుకుంటాడు..
సేమ్ ఇలాంటి సీన్ ఇప్పుడు ఐపీఎల్ లో కనిపిస్తోంది. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున సారథిగా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ పిరికివాడిగా మారిపోయాడు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతని బ్యాటింగ్ అత్యంత దారుణంగా ఉంది. ధోని వారసుడిగా వచ్చిన అతడు.. ఆ ఘనతను కొనసాగించలేకపోతున్నాడు. వరుసగా రెండు సీజన్లలో చెన్నై జట్టు విఫల ప్రదర్శన చేసింది. గత ఏడాది సరిగ్గా ఆటలేకపోయాడు. గాయాన్ని సాకుగా చూపించి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో ధోని తాత్కాలిక సారథిగా వ్యవహరించాల్సి వచ్చింది. ధోని తాత్కాలిక సారధిగా ఉన్నప్పటికీ చెన్నై జట్టు అంతగా విజయాలు సాధించలేదు.
Also Read: ఏమయ్యా గంభీర్.. చూసావా ఇదీ మా అయ్యర్ రేంజ్..
గైక్వాడ్ తొలి మ్యాచ్లో విఫలమయ్యాడు. రెండో మ్యాచ్లో ఓపెనర్ గా వచ్చాడు. సంజు అట్టర్ ప్లాఫ్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన ఆయుష్ మాత్రే దుమ్మురేపాడు. 19 సంవత్సరాల వయసు ఉన్న ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. అతడి దూకుడు వల్ల చెన్నై జట్టు ఆ స్కోర్ చేయగలిగింది.
ఆయుష్ మాదిరిగానే గైక్వాడ్ కూడా బ్యాటింగ్ చేసి ఉంటే చెన్నై జట్టు స్కోరు 250+ కు చేరుకునేది. కానీ ఆ అవకాశాన్ని చేజేతులా గైక్వాడ్ వదిలేసుకున్నాడు. పైగా డిఫెన్స్ ఆడుకుంటూ విసిగించాడు. కొన్ని సందర్భాలలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆయుష్ ను పుష్ చేశాడు. వికెట్లు పడుతున్నప్పుడు.. చేజింగ్ చేస్తున్నప్పుడు సాధారణంగా కెప్టెన్లు ఇలాంటి ఆట తీరు కొనసాగిస్తారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి విధానాన్ని ఏ కెప్టెన్ కూడా అనుసరించడు . ఇటువంటి కెప్టెన్ చెన్నై జట్టుకు అవసరమా.. ఇటువంటి కెప్టెన్ తో చెన్నై ట్రోఫీ సాధించగలదా.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు చెన్నై అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
