Homeక్రీడలుRR Vs RCB IPL 2024: కోహ్లీ సెంచరీ చేసినా.. చెత్త రికార్డు అంటూ విమర్శలు..

RR Vs RCB IPL 2024: కోహ్లీ సెంచరీ చేసినా.. చెత్త రికార్డు అంటూ విమర్శలు..

RR Vs RCB IPL 2024: రాజస్థాన్ జట్టుతో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. సెంచరీ చేసినప్పటికీ అతనిపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 113 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీకి ఇది ఐపీఎల్ లో 9వ సెంచరీ. ఓపెనర్ గా బరిలోకి దిగి చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. సహచర బ్యాటర్లు పెద్దగా ఆడకపోయినప్పటికీ.. జట్టు బ్యాటింగ్ భారాన్ని మొత్తం తను ఒక్కడే మోసాడు.

కోహ్లీ వల్లే..

కోహ్లీ చేసిన 113 పరుగుల వల్లే బెంగళూరు భారీ స్కోర్ చేయగలిగింది. లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కోహ్లీ ఒక్కడు 113 పరుగులు చేస్తే.. బెంగళూరు ఆటగాళ్లు 48 బంతుల్లో 59 పరుగులు మాత్రమే చేశారు. దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు కోహ్లీ ఎంత విలువైన ఇన్నింగ్స్ ఆడాడో. కోహ్లీ సెంచరీ ద్వారా బెంగళూరు అద్భుతమైన రికార్డులను తన సొంతం చేసుకుంది. ఈ జట్టు ఖాతాలో ఇప్పటివరకు 17 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ చేసిన 100 పరుగులతో ఆ సంఖ్య 18 కి చేరుకుంది. బెంగళూరు తర్వాత 14 సెంచరీలతో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉన్నాయి.

విమర్శల మీద విమర్శలు

కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. సెల్ఫిష్ గా ఆడాడు అంటూ కొంతమంది అతడిని ట్రోల్ చేస్తున్నారు. 12 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉండి.. స్లో ఇన్నింగ్స్ ఆడాడని నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ లో నెమ్మదిగా సెంచరీ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ మనీష్ పాండే సరసన నిలిచాడని నెటిజన్లు విమర్శిస్తున్నాడు. రెండువేల తొమ్మిదిలో బెంగళూరు తరఫున మనిష్ పాండే దక్కన్ చార్జర్స్ పై 67 బంతుల్లో సెంచరీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై కూడా శనివారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 67 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వీరిద్దరూ బెంగళూరు ఆటగాళ్ళే కావడం విశేషం. ఐపీఎల్ లో మనీష్ పాండే 67, విరాట్ కోహ్లీ 67, సచిన్ టెండూల్కర్ 66, డేవిడ్ వార్నర్ 66, బట్లర్ 66 బంతుల్లో 100 పరుగులు సాధించారు. స్లో యేస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ళుగా కొనసాగుతున్నారు.

అరుదైన మైలురాయి

ఈ సెంచరీ ద్వారా విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. టి20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడవ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు 22 సెంచరీలతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజాం 11 సెంచరీలతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 9 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆరోన్ ఫించ్ 8 సెంచరీలతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper
Exit mobile version