RR vs GT : బౌండరీ లైన్ వద్ద విజయ్ శంకర్ సూపర్బ్ క్యాచ్.. బిత్తర పోయిన రియాన్ పరాగ్

18 ఓవర్లో మోహిత్ శర్మ వేసిన తొలి మూడు బంతులను ధాటిగా ఆడిన పరాగ్.. నాలుగో బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ మధ్యలో స్ట్రోక్ లో తగలడంతో భారీ ఎత్తులో లేచింది. అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద విజయ్ శంకర్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. అమాంతం వచ్చిన బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు.

Written By: NARESH, Updated On : April 10, 2024 10:43 pm

Riyan Parag departs for 76 courtesy of Vijay Shankar's outfield brilliance

Follow us on

RR vs GT : ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బుధవారం జై పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్, రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టులో రియాన్ పరాగ్(48 బంతుల్లో; మూడు ఫోర్లు, 5 సిక్సర్లతో 76), సంజు సాంసన్(38 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తో అద్భుతంగా ఆడారు.. మ్యాచ్ ప్రారంభంలో రాజస్థాన్ జట్టు స్కోరు 32 పరుగుల వద్ద ఓపెనర్ యశస్వి జైస్వాల్(24), 42 పరుగుల వద్ద జోస్ బట్లర్(8) ఔట్ అయ్యారు. ఈ క్రమంలో మైదానంలోకి వచ్చిన కెప్టెన్ సంజు, రియాన్ పరాగ్.. ధాటిగా ఆడారు. వీరిద్దరూ ఏకంగా మూడో వికెట్ కు 130 పరుగులు జోడించారు. ఈ జోడిని విడదీసేందుకు గుజరాత్ కెప్టెన్ ఏకంగా ఐదుగురు బౌలర్లను ప్రయోగించాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలో 18.4 ఓవర్లో మోహిత్ శర్మ బంతిని భారీ షాట్ ఆడబోయి పరాగ్ అవుట్ అయ్యాడు.

18 ఓవర్లో మోహిత్ శర్మ వేసిన తొలి మూడు బంతులను ధాటిగా ఆడిన పరాగ్.. నాలుగో బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ మధ్యలో స్ట్రోక్ లో తగలడంతో భారీ ఎత్తులో లేచింది. అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద విజయ్ శంకర్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. అమాంతం వచ్చిన బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో బౌండరీ లైన్ కు తగులుతానేమోనని భావించి క్యాచ్ అందుకున్న బంతిని రెండు చేతులతో మైదానంలోకి నెట్టి.. బ్యాలెన్స్ ఆపుకోలేక బౌండరీ లోపలికి వెళ్ళాడు.. ఆ తర్వాత వెంటనే తేరుకొని మైదానంలోకి ఒక్క గంతు వేసి క్యాచ్ అందుకున్నాడు. దీంతో రియాన్ పరాగ్ నిరాశతో మైదానాన్ని వీడాడు. అప్పటికి రాజస్థాన్ జట్టు స్కోర్ 172 పరుగులకు చేరుకుంది.. విజయ్ శంకర్ క్యాచ్ పట్టిన విధానం పట్ల సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అంతకుముందు సంజు, పరాగ్ జోడిని విడదీయలేక గుజరాత్ బౌలర్లు నానా తంటాలు పడ్డారు. ముఖ్యంగా పరాగ్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్లో అతడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. రాజస్థాన్ జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నాడు. కెప్టెన్ సంజు కూడా నిలకడగా ఆడుతున్నాడు. అందువల్లే రాజస్థాన్ వరుస విజయాలు సాధిస్తోంది. గుజరాత్ జట్టు జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ భారీ స్కోరు సాధించడం వెనక పరాగ్, సంజు కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 130 పరుగులు జోడించడం విశేషం.