
కరోనా కల్లోలం ఆటగాళ్లపై కూడా పడుతోంది. క్రికెట్ పండుగ ప్రారంభమైన కఠినమైన కరోనా నిబంధనలతో బయో బుడగలో ఆటగాళ్లు ఉండాల్సి రావడంతో వారు తీవ్ర మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
Also Read: హైదరాబాద్ లో ఐపీఎల్ కు కేటీఆర్ డిమాండ్.. అజారుద్దీన్ మద్దతు
ఇక ఐపీఎల్ 2021కు కూడా ఎంతో సమయం లేదు. ఇంకా తేదీలు ప్రకటించలేదు.. కానీ ఏప్రిల్ 2వ వారంలో టోర్నమెంట్ ఆరంభమయ్యే అవకాశం మాత్రం ఉంది. భారత్ లోనే జరుగుతుందని భావిస్తున్న ఐపీఎల్ కు ముందు టీమిండియా ఆటగాళ్లందరూ తాజాగా ఉండాలని బీసీసీఐ కోరుకుంటోంది.
ఈ క్రమంలోనే 2020 ఐపీఎల్ సందర్భంగా సెప్టెంబరు 19 నుంచి బయో బబుల్ ఉంటున్న 10 మంది ఆటగాళ్లలో సాధ్యమైనంత ఎక్కువమందికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ చూస్తోంది.
ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు ఇటీవలే జట్టును ప్రకటించారు.ఈ జట్టులో బుమ్రాతోపాటు సిరాజ్ కు విశ్రాంతి కల్పించారు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా విజ్ఞప్తి చేయడంతో చివరి టెస్ట్ కంటే ముందు అతడిని జట్టు నుంచి విడుదల చేశారు.
ఇక ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ ఆరంభానికి ముందే బీసీసీఐ విశ్రాంతి తీసుకోవాలనుకునే ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. బయో బబుల్ లో ఎక్కువ కాలం ఉండడం వల్ల వచ్చే మానసిక ఇబ్బందులతో ఆటగాళ్లు కృంగిపోకుండా ఉండేందుకు విశ్రాంతిని ఇవ్వాలని నిర్ణయించింది.
Also Read: ఇండియన్ పిచ్ లు అంత ఘోరంగా ఉన్నాయా..?
ఇప్పటికే బుమ్రా, సిరాజ్ లకు ఇలానే టీ20 నుంచి విశ్రాంతినివ్వగా తాజాగా ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు రోహిత్ శర్మతోపాటు సుందర్, పంత్ లను దూరంగా పెట్టినట్లు సమాచారం.
ఇంగ్లండ్ తో మార్చి 12 నుంచి 20 వరకు 5 టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత మార్చి 23, 26,28వ తేదీల్లో వన్డే మ్యాచ్ లు జరుగుతాయి.