Homeక్రీడలుక్రికెట్‌Rohit Sharma: హిట్‌మ్యాన్‌ తెలుగోడే.. ఇదిగో ఈ వీడియోనే సాక్ష్యం

Rohit Sharma: హిట్‌మ్యాన్‌ తెలుగోడే.. ఇదిగో ఈ వీడియోనే సాక్ష్యం

Rohit Sharma: హిట్‌ మ్యాన్‌… ఈ పేరు వినగానే క్రికెట్‌ అభిమానులకు గుర్తుకు వచ్చే క్రికెటర్‌ రోహిత్‌శర్మ. 1987, ఏప్రిల్‌ 30న నాగపూర్‌లో జన్మించాడు. మరో 30 రోజుల్లో పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. ఇక రోహిత్‌శర్మ తల్లి పరిపూర్ణ. ఆమె స్వగ్రామం విశాఖపట్నం. నాన్న గురునాథ్‌శర్మ ఒక ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పనిచేసేవారు. ఇక రోహిత్‌శర్మ పెరిగింది ముంబైలోని బోరివలీలోని వాళ్ల నానమ్మ, తాతయ్య వద్ద. రోహిత్‌ తల్లిదండ్రులు ఒక సింగిల్‌ రూంలో ఉండేవారు. కొడుకును అక్కడ ఉంచుకోలేక తాతయ్య వద్దకు పంపించారు.

తెలుగే మాతృభాష..
ఇక రోహిత్‌ మాతృభాష తెలుగు ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో రోహిత్‌ శర్మ కూడా తెలిపారు. తల్లి పరిపూర్ణది విశాఖపట్నం కావడంతో తాను కూడా తెలుగు వాడినే అని హిట్‌మ్యాన్‌ గర్వంగా చెబతారు. తన మదర్‌ టంగ్‌ తెలుగు అని పేర్కొంటారు. తాజాగా ఐపీఎల్‌–2024 ప్రారంభమైంది. గత సీజన్‌ వరకు ముంబై జట్టుకు రోహిత్‌ సారథిగా వ్యవహరించారు. ఈసారి పాండ్యా జట్టును నడపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సీజన్‌లో ముంౖ»ñ జట్టు ఇంకా బోణీ కొట్టలేదు.

1999లో క్రికెట్‌ మొదలు..
ఇక రోహిత్‌ శర్మ 1999లో క్రికెట్‌ కోచింగ్‌ ప్రారంభించాడు. అతని బాబాయ్‌ కోచింగ్‌కు అవసరం అయిన డబ్బు ఇచ్చాడు. రోహిత్‌ ముందుగా ఆఫ్‌ స్పిన్నర్‌గా క్రికెట్‌ కెరీర్‌ మొదలు పెట్టాడు. కానీ కోచ్‌ దినేశ్‌లాడ్‌.. రోహిత్‌లో ఉన్న బ్యాటింగ్‌ నూపుణ్యాన్ని గుర్తించాడు. అతడిరి బ్యాటింగ్‌వైపు ప్రోత్సహించాడు.

2013లో జాతీయ జట్టులోకి..
ఇక రోహిత్‌ శర్మ 2013లో జాతీయ జట్టులోకి వచ్చాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా వెస్టిండీస్‌లో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ లాస్ట్‌ మ్యాచ్‌ కూడా ఇదే. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 177 పరుగులు చేశాడు. ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే రెండో అత్యధిక స్కోరుగా రికార్డు సృష్టించాడు.

వన్డేల్లో రికార్డు స్కోర్‌..
ఇక రోహిత్‌ శర్మ వన్డేల్లో వ్యక్తిగత స్కోర్‌ రోహిత్‌శర్మ(264) పేరిటే ఉంది. 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఈ స్కోర్‌ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు కొట్లాడు. ఒక వన్డే ఇన్నింగ్స్‌లో ఇవే అత్యధిక ఫోర్లు. ఇక మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా హిట్‌మాన్‌ రికార్డులకెక్కాడు. అంతకుముందు సురేష్‌ రైనా ఈ ఫీట్‌ సాధించాడు. ఇక రోహిత్‌ మూడు ఫార్మాట్లలోనూ సిక్స్‌ కొట్టి సెంచరీ సాదించడం విశేషం. ఇది అరుదైన రికార్డు. వన్డేల్లో రోహిత్‌షర్మ 150 ప్లస్‌ పరుగులు 8సార్లు సాధించాడు. గతంలో సచిన్‌ , డేవిడ్‌ వార్నర్‌ పేరిట ఉన్న రికార్డులు ఇప్పుడు రోహిత్‌పేరిట ఉన్నాయి.

మరికొన్ని రికార్డులు..
ఇక ఒక వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు ఇయాన్‌ మోర్గాన్‌ (17) పేరిట ఉన్నాయి. ఆ తర్వాత స్థానం రోహిత్‌ శర్మ(16) ఉన్నారు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన టీమ్‌ ఇండియా క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ(120) రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌(118) రోహిత్‌శర్మ పేరిటే ఉంది. కెప్టెన్‌గా ఉంటూ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌ కూడా రోహితే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular