Rohit Sharma Virat Kohli: ఆధునిక క్రికెట్ లో సూపర్ జోడిగా పేరుపొందారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీరిద్దరూ అన్ని జట్లపై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై వీరిద్దరికీ అద్భుతమైన రికార్డు ఉంది. సచిన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుగా విరాట్, రోహిత్ కొనసాగుతున్నారు.
విరాట్, రోహిత్ టీ 20, టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. కేవలం వారు వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవల మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల రోహిత్ వన్డే కెప్టెన్ స్థానం నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అతడు ఒక సాధారణ ఆటగాడిగానే మిగిలిపోయాడు.. విరాట్ కోహ్లీ కూడా ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. వీరిద్దరూ ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టారు. టీమిండియా చాంపియస్ ట్రోఫీ సాధించడంలో రోహిత్, విరాట్ కోహ్లీ ముఖ్యపాత్ర పోషించారు. స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడడం వల్ల టీమిండియా చాలా సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
ఇప్పుడు అక్టోబర్ 19 నుంచి టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ మైదానంలో అడుగుపెట్టలేదు. చాలా రోజుల తర్వాత వారిద్దరు టీమిండియా కు ఆడుతున్న నేపథ్యంలో అభిమానులలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వీరిద్దరూ అద్భుతంగా ఆడతారని.. ఆస్ట్రేలియాపై తమ రికార్డులను మరింత మెరుగుపరుచుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. టీమిడియాకు ఎంతో విజయవంతమైన రికార్డు ఉన్న పెర్త్ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈ వన్డే నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నెట్స్ లో తీవ్రంగా సాధన చేశారు.
ఇటీవల రోహిత్ శర్మ బరువును చాలావరకు తగ్గించుకున్నాడు. ముంబైలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అతడు బంతిని కొడితే.. ఎంతో విలువైన లంబోర్గిని కారు అద్దాలను బద్దలు కొట్టింది. అయితే ఆ కారు రోహిత్ శర్మది కావడం విశేషం. మరోవైపు విరాట్ కోహ్లీ మైదానంలో దిగి ప్రాక్టీస్ చేయకపోయినప్పటికీ.. నేరుగా అతడు లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు. జట్టు ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తూ పాత కోహ్లీని పరిచయం చేశాడు.
THE MUCH AWAITED MOMENT
– Rohit Sharma & Virat Kohli practising together for the ODI series. [RevSportz] pic.twitter.com/JGzkqgFXfU
— Johns. (@CricCrazyJohns) October 16, 2025