Rohit Sharma-Virat Kohli: ఇండియన్ టీం ప్రస్తుతం ఆఫ్గాన్ తో ఒక టి20 సిరీస్ ఆడడానికి సిద్ధమవుతుంది. ఇక అందులో భాగంగానే 11, 14, 17వ తేదీల్లో మూడు టి20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఇలాంటి నేపథ్యంలో బిసిసిఐ ఈ సిరీస్ కోసం ఆడే 16 మంది ప్లేయర్ల తో కూడిన ఒక టీం ని సెలెక్ట్ చేసింది…ఇక అందులో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లకి చోటు కల్పించింది. దాంతో పాటుగా రోహిత్ శర్మ ఈ సిరీస్ కి కెప్టెన్ గా కూడా వ్యవహరించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ టి20 మ్యాచ్ లను ఆడి దాదాపు సంవత్సరం పైన అవుతుంది. అయితే ఈ సంవత్సరం జూన్ లో టి20 వరల్డ్ కప్ ఉండడంతో వీళ్ళని టి 20 టీం లోకి తీసుకోనున్నట్టుగా బీసీసీఐ తెలియజేసింది. ఇక ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఓపెనర్ ప్లేయర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న కేఎల్ రాహుల్ కి మాత్రం ఈ సిరీస్ లో మొండి చేయి చూపించింది.
వన్డే వరల్డ్ కప్ లో తన సత్తా చాటుకున్న కేఎల్ రాహుల్ రీసెంట్ గా సౌతాఫ్రికా మీద జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు.ఇక ఇలా మంచి ఫామ్ లో ఉన్న కే ఎల్ రాహుల్ ని పక్కన పెట్టడం పట్ల పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రాహుల్ ని పక్కన పెట్టడం వెనుక బీసీసీఐ ఒక పెద్ద ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది.అది ఏంటి అంటే ఆఫ్గాన్ తో టి20 సిరీస్ ముగిసిన వెంటనే ఇండియా ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడబోతుంది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ డబ్ల్యూటీసి ఫైనల్ కీ చాలా కీలకంగా మారిపోతుంది.
అందువల్లే టెస్టుల్లో బాగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ కి విశ్రాంతినిచ్చినట్టుగా తెలుస్తుంది. మహమ్మద్ సిరాజ్, బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ లాంటి ప్లేయర్లకు కుడా టి20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చినట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే అఫ్గాన్ తో ఈ సిరీస్ ముగిసింది అంటే ఇక టి 20 వరల్డ్ కప్ వరకు అసలు టి 20 సీరీస్ అదే అవకాశమే లేదు.ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఉంది. అది అయిపోయిన వెంటనే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది.ఇక ఐపీఎల్ అయిపోయిన వెంటనే టి20 వరల్డ్ కప్ జరగబోతుంది.
కాబట్టి ఇటువంటి కీలకమైన సిరీస్ లో బాగా ఆడిన వాళ్ళకి టి20 వరల్డ్ కప్ లో అవకాశం దక్కుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ పర్ఫార్మ్ చేయలేకపోయిన ఐపిఎల్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని కూడా ప్లేయర్లను టీమ్ లోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక ఈ సిరీస్ కోసం ఇండియన్ టీం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లతో పాటు గా యంగ్ ప్లేయర్లను కూడా సెలెక్ట్ చేసింది వాళ్ళెవరో ఒకసారి మనం కూడా చూద్దాం…
రోహిత్ శర్మ ( కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్,యశస్వి జైశ్వాల్,విరాట్ కోహ్లీ,తిలక్ వర్మ, రింకు సింగ్, జితీష్ శర్మ (వికెట్ కీపర్),సంజు శాంసన్,శివమ్ దూబె, వాషింగ్ టన్ సుందర్,అక్షర్ పటేల్,రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, ముకేష్ కుమార్, అర్షదీప్ సింగ్ లాంటి ప్లేయర్లతో ఇండియన్ టీమ్ ఈ సీరీస్ అడనుంది…