Rohit Sharma: ఎన్ని రోజులైంది ఆ బ్యాటింగ్ చూసి.. ఎన్ని దినాలు అయింది అలా సిక్సర్లు కొట్టి.. ఎన్ని నెలలు అయింది అలా ఫోర్లు కొట్టి.. దారుణంగా అవుట్ అవుతుంటే.. 0 పరుగులకే వెను తిరుగుతుంటే.. ఇక రిటైర్మెంట్ తీసుకో.. ఇక ఆడింది చాలు.. ఇలా ఇన్ని విమర్శలు వినిపించాయో.. ఎన్ని సూటి పోటి మాటలు సీనియర్ల నుంచి వచ్చాయో.. అవన్నీ సహించాడు.. ఆ మాటలను భరించాడు. చివరికి అగ్నిపర్వతంలాగా బద్దలయ్యాడు. తన మీద వస్తున్న విమర్శలకు సరైన సమాధానం చెప్పాడు.
The flick first and then the loft!
Captain Rohit Sharma gets going in Cuttack in style!
Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/uC6uYhRXZ4
— BCCI (@BCCI) February 9, 2025
కటక్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. వైట్ బాల్ ఫార్మాట్లో ఈ ఏడాది అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ.. ఓవరాల్ గా తన కెరియర్లో 58 వ వన్డే హాఫ్ సెంచరీ.. 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో రోహిత్ శర్మ 53 పరుగులు చేశాడు. (ఈ కథనం రాసే సమయానికి).. ఓపెనర్ గా బరిలోకి వచ్చిన అతడు.. మరో ఓపెనర్ గిల్ తో కలిసి ఇప్పటివరకు తొలి వికెట్ కు 84 పరుగులు జోడించాడు. తద్వారా ఇంగ్లాండ్ జట్టు విధించిన 305 పరుగుల టార్గెట్ ను చేదించడానికి టీమిండియా కు బలమైన బాటలు వేశాడు.
అరుదైన రికార్డు
కటక్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సరికొత్త రికార్డు సృష్టించాడు.. బంతుల పరంగా నాలుగో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.. 2022లో మిర్ పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో 27 బంతుల్లోనే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. 2024లో కొలంబోలో జరిగిన వన్డే మ్యాచ్లో శ్రీలంక జట్టుపై 29 బంతుల్లోనే ఆర్థిక సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2023లో ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 30 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం కటక్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై 30 బంతుల్లోనే రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. 2023లో రాజ్ కోట్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో 31 బంతుల్లోనే రోహిత్ అర్ద సెంచరీ పూర్తి చేశాడు.
కొంతకాలంగా సరైన ఫామ్ లో లేక..
రోహిత్ శర్మ కొంతకాలంగా సరైన ఫామ్ లో లేడు. తన పూర్వపు లయను అందుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే రంజి మ్యాచ్ లు కూడా ఆడాడు. ముంబై జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు అంతగా రాణించలేదు. దీంతో అతడి పై విమర్శలు పెరిగిపోయాయి. సునీల్ గవాస్కర్ లాంటి ఆటగాడు కూడా రోహిత్ శర్మను రిటైర్మెంట్ ప్రకటించు అని నేరుగా ప్రశ్నించాడు. ఈ విషయాన్ని రోహిత్ టీమ్ ఇండియా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో మళ్ళీ అతనిపై విమర్శలు మొదలయ్యాయి. అయితే ఈసారి తనపై వస్తున్న విమర్శలకు సరైన సమాధానం చెప్పాలని భావించిన రోహిత్.. కటక్ వేదికగా జరుగుతున్న రెండవ వన్డేలో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు.. తన మునుపటి బ్యాటింగ్ స్టైల్ ను ప్రదర్శించాడు.
Captain Vice-captain
5⃣0⃣-run stand ✅
Updates ▶️ https://t.co/NReW1eEiE7#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 | @ShubmanGill pic.twitter.com/7Kr85FJUTP
— BCCI (@BCCI) February 9, 2025