Rohit Sharma- Kohli: టీమిండియా ఆటగాళ్ల మానసిక సామర్థ్యంపై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లలో మానసిక స్థైర్యం దెబ్బతింటే దాని ప్రభావం ఆటపై పడుతుంది. క్రీడాకారులు సమర్థంగా ఆడాలంటే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి గురయితే ఆటపై దృష్టి పెట్టడం వీలు కాదు. క్రీడాకారులు కరోనా సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డారు. దీంతో వారి మానసిక స్థితి అగమ్యగోచరంగా మారిన విషయం తెలిసిందే. ఆటగాళ్లలో భయం పోగొట్టి సరైన రీతిలో ఆడేందుకు వారికి ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం చేస్తుంటారు.
ఆటగాళ్ల మానసిక స్థితి భిన్నంగా ఉంటుంది. ఒక్కో ఆటగాడి స్థితి ఒక్కోలా ఉంటుంది. వారిని సరైన దారిలోకి తీసుకురావడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడుతున్నాడు. ఆసియా కప్ ప్రారంభమవుతున్న తరుణంలో రోహిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మేరకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా స్పందించాడు. గత పదేళ్లలో తాను ఓ నెల రోజులు బ్యాట్ పట్టుకోకుండా ఉండటం ఇదే తొలిసారి అని పేర్కొన్నాడు. తన శక్తి సామర్థ్యాలు సరిగా చూపించలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు.
Also Read: AP Police: గొంతెత్తిన వారిపై ‘నాలుగో సింహం’ ప్రతాపం.. ఏపీలో అ‘న్యాయ’రోదన
అయితే దీనిపై రోహిత్ కూడా విరాట్ కు మద్దతు తెలిపాడు. ఆటగాళ్ల మానసిక స్థైర్యం దెబ్బతిన్నప్పుడు విరాట్ అండగా ఉన్నాడని కొనియాడాడు. కోవిడ్ సమయంలో చాలా మంది ఆటగాళ్లు సరైన స్థితిలో లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచి కోహ్లి వారికి ధైర్యం చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. హోటళ్ల నుంచి బయటకు వెళ్లలేని స్థితిలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా విరాట్ వారికి ఓదార్పు నిచ్చాడు.
ఆసియా కప్ లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నందున ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ప్రేక్షకులు దుబాయ్ చేరుకున్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ను ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో విజయం సాధించేందుకే అన్ని వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని చూస్తోంది శుభారంభం చేసి ప్రేక్షకులకు నజరానా అందివ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Sharwanand: అమ్మో శర్వానంద్ అంత పెద్ద కోటీశ్వరుడా…హైదరాబాద్ లో మూడో వంతు తనదే ప్రతి ఏరియాలో స్థలం!