India Vs Australia: ఆస్ట్రేలియాతో టీమిండియా ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే ఇందులో మూడు టెస్టులు ముగిసాయి. నాలుగో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా మొదలైంది. ఈ టెస్ట్ లో టీమిండియా టాస్ పడిపోయింది. ఫీల్డింగ్ లోకి దిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఆరంభం లభించింది. ఈ మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సామ్ కోన్ స్టాస్(65) మైదానంలో విధ్వంసం సృష్టించాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో హోరెత్తించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారీ స్కోర్ సాధించకుండా ఉండడానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ తరచూ మార్చాడు. ఈ క్రమంలో లబూ షేన్ ను అవుట్ చేయడానికి రోహిత్ సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డర్ ను ఏర్పాటు చేశాడు. స్పిన్ బౌలర్లతో అటాక్ చేయించాడు. సిల్లీ పాయింట్ వద్ద యశస్వి జైస్వాల్ ను ఫీల్డింగ్ లో ఉంచాడు. ఈ దశలో అతడు పదేపదే ఎగురుతూ కనిపించాడు. లబూ షేన్ బంతిని ఆడకముందే యశస్వి జైస్వాల్ ఎగిరాడు. ఇది రోహిత్ శర్మకు ఆగ్రహాన్ని కలిగించింది. ” ముందు బంతిని చూడు. ఆ తర్వాత జంప్ చెయ్. అతడు బంతిని కొట్టకముందే నువ్వు ఎగురుతున్నావు. అలా చేయకు. నువ్వేమైనా గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? బ్యాటర్ ఆడుతున్న బంతిని చూడాలి కదా.. ముందుగా నువ్వు నేల మీద ఉండు.. బంతి వైపు నీ దృష్టిని సారించి” అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు. రోహిత్ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
భారీ స్కోర్ దిశగా
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా ప్రయాణం సాగిస్తోంది. ఓపెనర్లు సామ్ కోన్ స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా (57), లబూషేన్(72), స్టివ్ స్మిత్ (68*), క్యారీ (23*) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ఆస్ట్రేలియా కడపటి వార్తలు అందే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 291 రన్స్ చేసింది. భారీ స్కోరు దిశగా ప్రయాణం సాగిస్తోంది. ఆస్ట్రేలియాలో విధ్వంసకరమైన ఆటగాలుగా పేరుపొందిన హెడ్ (0), మార్ష్(4) విఫలమైనప్పటికీ.. క్యారీ, స్మిత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను నిదానంగా నడిపిస్తున్నారు. ఎప్పటిలాగానే బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. జడేజా, సుందర్ చెరో వికెట్ సాధించారు. మహమ్మద్ సిరాజ్ వికెట్లు ఏమీ తీయకపోయినప్పటికీ.. పదునైన బంతులు వేస్తున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి వైవిధ్యంగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.
Stump Mic Gold ft. THE BEST, @ImRo45! ️
The Indian skipper never fails to entertain when he’s near the mic! #AUSvINDOnStar 4th Test, Day 1 LIVE NOW pic.twitter.com/1fnc6X054a
— Star Sports (@StarSportsIndia) December 26, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Rohit sharma gives yashaswi jaiswal a mouthful at mcg
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com