
కరోనా క్రైసిస్ లో ప్రేక్షకులు లేకుండానే మైదానంలో మ్యాచులు జరుగుతున్నాయి. ఇటీవల బీసీసీఐ దుబాయ్ లో ఐపీఎల్ నిర్వహించి కరోనా టైంలోనూ క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంది. ఇక కరోనా నేపథ్యంలోనే భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు.. మూడు ట్వీ-20 మ్యాచులు.. నాలుగు టెస్టులు మ్యాచులను ఆడేందుకు ఆ దేశానికి వెళ్లిన సంగతి తెల్సిందే..!
Also Read: టీమిండియా ఓటమికి కారణమేంటి?
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ముందుగా వన్డే మ్యాచులు ఆ తర్వాత ట్వీ-20.. అనంతరం టెస్టులు మ్యాచులను భారత్ ఆడనుంది. ఇక మూడు వన్డేల్లో భాగంగా భారత్ ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడిపోయి సీరిస్ కోల్పోయింది. కోహ్లీ కెప్టెన్సీలో ఆడుతున్న భారత్ తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించకోవడంతో ఫ్యాన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్-ఆస్ట్రేలియా మ్యాచులు హోరాహోరీగా సాగుతాయని భావించగా భారత్ క్రికెటర్లు చెత్త ఆటతో నిరాశ పరుస్తున్నారు. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా సిరీసు కైవసం చేసుకోవడంతో కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్స్ విన్పిస్తున్నాయి. ఇక ఈ ఏడాది న్యూజిలాండ్ జరిగిన మూడు వన్డేల సీరిస్ 0-3తో.. రెండు టెస్టుల సిరీస్‌ను 0-2తో భారత్ కోహ్లీ కెప్టెన్సీలోనే కోల్పో యింది.
Also Read: విరాట్, రోహిత్ మధ్య వివాదం నడుస్తోందా.?
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచులను కూడా కలుపుకుంటే కోహ్లీ కెప్టెన్సీలో భారత్ వరుసగా ఏడు మ్యాచులు ఓడిపోయినట్లు. 18ఏళ్ల క్రితం గంగూలీ కెప్టెన్సీలో భారత్ వరుసగా 10మ్యాచుల్లో ఓటమిపాలైంది. ధోని భారత్ జట్టులో ఉన్నప్పుడు కోహ్లీకి మంచి సహకారం లభించేంది. కోహ్లీ కెప్టెన్ ఉన్నప్పటికీ కీలక సమయంలో ధోని నుంచి కోహ్లీకి మంచి సహకారం లభించేది. ప్రస్తుతం అతడి రిటైర్మెంట్ కావడంతో ఆ ఎఫెక్ట్ కోహ్లీపై పడినట్లు కన్పిస్తోంది.
ఐపీఎల్లో ఒక ఆటగాడు అద్భుత ప్రదర్శన చేస్తే భారత టీములోకి తీసుకుంటున్నప్పడు రోహిత్ నాయకత్వంలో ముంబై ఐదుసార్లు టైటిల్ గెలిచిందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు రోహిత్ ను భారత టీముకు ఎందుకు కెప్టెన్ గా చేయకూడదని రోహిత్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ వరుసగా ఓటమి చెందుతుండటంతో ఆ స్థానాన్ని ‘హిట్ మ్యాన్’తో భర్తీ చేయాలని కోరుతున్నారు. దీంతో ఆస్ట్రేలియాతో మున్మందు మ్యాచ్ లు భారత్ గెలువకపోతే కోహ్లీ కెప్టెన్సీకి ఎసరు రావడం ఖాయంగా కన్పిస్తోంది.
Comments are closed.