Rishabh Pant Injury Update: మూడో టెస్టులో చేతికి గాయం.. నాలుగో టెస్ట్ కు కాలికి గాయం. ఇలా వరుస గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు టీమిండియా వికెట్ కీపర్, ఉపసారధి రిషబ్ పంత్. నాలుగో టెస్టులో తీవ్రమైన గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ అతడు బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను కొంతలో కొంత ఎదుర్కొన్నాడు. అయితే కీపింగ్ మాత్రం చేయలేకపోతున్నాడు. దీంతో అతడి స్థానంలో మరో ఆటగాడు చేస్తున్నాడు..
Also Read: స్టేడియం హోరెత్తింది.. దేశానికి నీలాంటి సైనికుడే కావాలి ‘పంత్’.. గ్రేట్ అంతే
రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ.. అతడు శరీర సామర్థ్యం సరిపోడం లేదని తెలుస్తోంది. పైగా కాలినొప్పితో అతడు బాధపడుతున్నాడని.. అందువల్లే అతనికి ఐదవ టెస్టులో విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావించినట్టు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగే చివరి టెస్టుకు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరం అవుతున్నట్టు సమాచారం. ఐదో టెస్టులో రిషబ్ పంత్ స్థానంలో తమిళనాడు ఆటగాడు జగదీషన్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ ను ఎంపిక చేశారు. అయితే అతను కూడా గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో.. అతడి స్థానంలో జగదీషన్ ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నాలుగు టెస్టులో అంతటి గాయంతో కూడా బ్యాటింగ్ చేసి.. హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్.. ఐదో టెస్ట్ ఆడబోడని.. అతడి స్థానంలో జగదీషన్ ఆడతాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
అంతగా గాయం అయినప్పటికీ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ చేయడం పట్ల ప్రశంసలు లభిస్తున్నాయి. రిషబ్ పంతులు మాజీ ఆటగాళ్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆటపై ఈ స్థాయిలో మక్కువ పెంచుకున్నాడు కాబట్టే.. రిషబ్ పంత్ ఈ స్థాయిలో ఉన్నాడని వ్యాఖ్యానించారు.. మరోవైపు గాయం తోనే పంత్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వస్తుంటే అభిమానులు కేరింతలు కొట్టారు. పంత్ పంత్ అంటూ నినాదాలు చేశారు. అతడు హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మైదానంలో ఉన్న అభిమానులు చప్పట్లు కొట్టి అతడిని అభినందించారు.
Also Read: ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి.. సీన్ కట్ చేస్తే ఇండియాను కోలు కోలేని దెబ్బతీశాడు
రిషబ్ పంత్ మూడో టెస్ట్ లో కూడా గాయపడ్డాడు. అతని చేతి వేలికి గాయం కావడంతో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. వికెట్ కీపింగ్ అతడి స్థానంలో జూరెల్ చేశాడు. మూడో టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ దాటిగా ఆడే క్రమంలో ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడు అవుట్ కావడం టీమిండియా విజయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.. పంత్ అవుట్ అయిన తర్వాత మిగతా ఆటగాళ్లు కూడా పెవీలియన్ వెళ్లడానికి క్యూ కట్టడంతో.. భారత్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. సిరాజ్, బుమ్రా, రవీంద్ర జడేజా ప్రతిఘటించినప్పటికీ.. చివరికి విజయం ఇంగ్లాండ్ జట్టు సొంతమైంది. ఫలితంగా సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో ముందంజ వేసింది.
Tamil Nadu’s Narayan Jagadeesan makes an explosive start to the Ranji Trophy 2024-25 with a fantastic hundred, his 9th first-class hundred.
The celebration by N Jagadeesan after reaching his hundred against Saurashtra. #RanjiTrophy #RanjiTrophy2024 pic.twitter.com/Jwv2fxdexH
— Saabir Zafar (@Saabir_Saabu01) October 12, 2024