https://oktelugu.com/

GT vs KKR : వాట్ ఏ మ్యాచ్.. లాస్ట్ ఓవర్ లో 5 సిక్సులు.. గుజరాత్ పై కోల్ కతాను గెలిపించిన రింకూసింగ్

GT vs KKR : ఐపీఎల్ లోనే బలమైన టీం ‘గుజరాత్ టైటాన్స్’. ఇప్పటికే తొలి మ్యాచ్ లో చెన్నైని చిత్తు చేసి రెండో మ్యాచ్ లోనూ గెలిచి తనకు ఎదురులేకుండా ఉంది. మూడో మ్యాచ్ లో కోల్ కతాతో కూడా ఈజీగా గుజరాత్ గెలుస్తుందని అనుకున్నారు. ఎందుకంటే గుజరాత్ టోర్నీలో బలమైన జట్టు. ఇక కోల్ కతా తొలి మ్యాచ్ లో ఓడి రెండో మ్యాచ్ లో గెలిచి పుంజుకున్నా సమస్యలు చాలానే ఉన్నాయి. అయితే కోల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 9, 2023 7:51 pm
    Follow us on

    GT vs KKR : ఐపీఎల్ లోనే బలమైన టీం ‘గుజరాత్ టైటాన్స్’. ఇప్పటికే తొలి మ్యాచ్ లో చెన్నైని చిత్తు చేసి రెండో మ్యాచ్ లోనూ గెలిచి తనకు ఎదురులేకుండా ఉంది. మూడో మ్యాచ్ లో కోల్ కతాతో కూడా ఈజీగా గుజరాత్ గెలుస్తుందని అనుకున్నారు. ఎందుకంటే గుజరాత్ టోర్నీలో బలమైన జట్టు. ఇక కోల్ కతా తొలి మ్యాచ్ లో ఓడి రెండో మ్యాచ్ లో గెలిచి పుంజుకున్నా సమస్యలు చాలానే ఉన్నాయి.

    అయితే కోల్ కతా బ్యాట్స్ మెన్ రింకూ సింగ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. చివరి ఓవర్లో 29 పరుగులు కావాల్సిన దశలో చెలరేగిపోయాడు. గుజరాత్ కు షాకిస్తూ కోల్ కతాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. చివరి 20వ ఓవర్ చివరి 5 బంతుల్లో ఐదు సిక్సులు కొట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. దీంతో కోల్ కతా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అసలు గెలుపు పై అంచనాలు లేని వేళ గుజరాత్ పై ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది.

    గుజరాత్ చివరి వరకూ విజయంపై ధీమాగానే ఉంది. ఎందుకంటే అప్పటికే కోల్ కతాకు 7 వికెట్లు పడ్డాయి. క్రీజులో రింకూసింగ్ తోపాటు బౌలర్ ఉమేశ్ యాదవ్ ఉన్నారు. ఇక కోల్ కతా గెలవదు అనుకున్నారు. కానీ తొలి బంతికి సింగిల్ తీసి రింకూసింగ్ కు ఉమేష్ స్ట్రైక్ ఇచ్చాడు. యష్ ధయాల్ వేసిన ఈ 5 బంతుల్లో ఏకంగా 5 సిక్సులు కొట్టిన రింకూసింగ్ కోల్ కతాను గెలిపించాడు.

    అంతకుముందు గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో ఏకంగా 204 పరుగులు సాధించింది. విజయ్ శంకర్ 24 బంతుల్లోనే 63 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు సాయిసుధర్శన్ 53 పరుగులతో రాణించాడు. లక్ష్యఛేదనకు దిగిన కోల్ కతా ఏ దశలోనూ గెలుస్తుందని అనుకోలేదు. అయితే వెంకటేశ్ అయ్యర్ 83, నితీర్ రాణా 45, రింకూసింగ్ 48 నాటౌట్ పరుగులతో చివర్లో దంచి కొట్టడంతో కోల్ కతా ఈ అద్భుత విజయాన్ని అందుకుంది.

    https://twitter.com/MdBadrulHasan16/status/1645061956527861760?s=20