IPL 2024: సర్ఫరాజ్ ఖాన్.. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ టెస్ట్ సిరీస్లో తనదైన ప్రతిభ చూపి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.. అంతకుముందు అతడు డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పాలించాడు. సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు అతడికి మరో అదృష్టం తలుపు తట్టింది. ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో ఆడే అవకాశం లభించింది. దీంతో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సర్ఫ రాజ్ సిద్ధమవుతున్నాడు.. వాస్తవానికి సర్ఫ రాజ్ ను మినీ వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో అతడు నిరాశ చెందాడు. వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్టు.. అతడికి ఇప్పుడు ఐపీఎల్ లో కి ఎంట్రీ ఇచ్చే అవకాశం లభించింది. మూడు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఓ ఆటగాడు గాయపడటంతో.. సర్ఫ రాజ్ కు ఐపీఎల్ లో ఆడే అవకాశం లభించింది.
సర్ఫ రాజ్ ఐపీఎల్ 17వ ఎడిషన్ లో గుజరాత్ జట్టు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఈ జట్టు మూడు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన రాబిన్ మింజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అతడు కోలుకొని ఐపీఎల్ ఆడతాడని గుజరాత్ జట్టు భావించింది. కానీ ఆ పరిస్థితి కనిపించకపోవడంతో రాబిన్ ఈ సీజన్ కు దూరమయ్యే అవకాశాలున్నాయని గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా చెబుతున్నాడు. ఇప్పటికే క్యాష్ ఆన్ ట్రేడ్ ద్వారా హార్దిక్ పాండ్యా, సర్జరీ కారణంగా మహ్మద్ షమీ గుజరాత్ జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు యువ ఆటగాడు రాబిన్ కూడా అందుబాటులో లేకపోవడంతో గుజరాత్ జట్టుకు టోర్నికి ముందే షాక్ తగిలినట్టయింది. రాబిన్ స్థానంలో టీం ఇండియా చిచ్చరపిడుగు సర్ఫ రాజ్ ఖాన్ ను తీసుకునే యోచనలో గుజరాత్ జట్టు ఉన్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో సర్ఫరాజ్ మెరుపులు మెరిపించాడు. రాజ్ కోట్, రాంచీ, ధర్మశాల టెస్టులో మెరుగైన ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. అతడిని మాజీ ఆటగాళ్లు అభినవ ఇండియన్ బ్రాడ్ మన్ అని కొనియాడుతున్నారు.. అయితే సర్ఫ రాజ్ గుజరాత్ జట్టులోకి ఎంట్రీ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా రీ- ఎంట్రీ ఇచ్చాడు. వరుస గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమవుతున్న నేపథ్యంలో రషీద్ ఖాన్ రాక గుజరాత్ జట్టుకు సానుకూల అంశం.