RCB Vs SRH IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ లో తొలి మ్యాచ్ ను డిపెండింగ్ ఛాంపియన్ బెంగళూరు విజయంతో ప్రారంభించింది.. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సొంత మైదానం.. భారీగా వచ్చిన అభిమానుల మధ్య బెంగళూరు జట్టు అన్ని విభాగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించి.. హైదరాబాద్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
Also Read: మనిషా.. పక్షా.. ఇలా జరిగిందేంటి?.. షాక్ లో ఇషాన్ కిషన్
ఈ మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు బౌలర్ డఫి ప్రారంభంలోనే మూడు వికెట్లు పడగొట్టాడు. హైదరాబాద్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఈక్రమంలో ఇషాన్ కిషన్.. క్లాసెన్ గట్టిగా నిలబడ్డారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 97 పరుగులు జోడించారు. సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్ లకు వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుట్ అయ్యారు. ఫలితంగా హైదరాబాద్ స్కోర్ 201 పరుగులలు మాత్రమే పరిమితమైపోయింది.
202 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో సాల్ట్ వికెట్ కోల్పోయినప్పటికీ.. బెంగళూరు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. రజత్ పాటిదర్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో బెంగళూరు జట్టు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 15.4 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. తద్వారా ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది.
బెంగళూరు విజయం సాధించిన నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు కలవర పడుతున్నారు. ఎందుకంటే కదా సీజన్లో బెంగళూరు విజేతగా నిలిచింది. సొంత మైదానంలో ఆడిన మూడు మ్యాచ్లలో ఓటమి పాలైంది. అయినప్పటికీ మిగతా మ్యాచ్లలో బెంగళూరు ఆటగాళ్లు సత్తా చూపడంతో తొలిసారిగా ఛాంపియన్గా అవతరించింది. ఈసారి తొలి మ్యాచ్లో విజయం సాధించడంతో.. బెంగళూరు చాంపియన్ అవ్వడం కష్టమని అభిమానులు భావిస్తున్నారు.. బెంగళూరులో సమర్థవంతమైన ఆటగాళ్లకు లోటు లేకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాలలో దురదృష్టం వెంటాడితే చేసేది ఏమీ లేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో బెంగళూరు సొంత మైదానంలో వరుస విజయాలు సాధించినప్పటికీ.. మిగతా సందర్భాలలో ఓటమిపాలైంది. ఫలితంగా ట్రోఫీ అందుకోకుండానే వెనక్కి వచ్చేసింది. ఈసారి ఆ దురదృష్టం రిపీట్ కాకూడదని బెంగళూరు అభిమానులు కోరుకుంటున్నారు.