RCB Vs SRH 2026: హైదరాబాద్ జట్టు ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి దారుణంగా విఫలమయ్యారు. దీంతో బెంగళూరు జట్టు బౌలర్ల ముందు సన్ రైజర్స్ పరువుపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు.
Also Read: అక్కా.. కేసులు వెనక్కి తీసుకో.. పాపం రేవంత్ రెడ్డిది మామూలు బాధ కాదు పో..
కాటేరమ్మ కొడుకులు విఫలమైన చోట కాటేరమ్మ నయా వారసుడు దుమ్ము రేపాడు. ఢపీ, భువనేశ్వర్ కుమార్ చెలరేగుతున్న వేళ వారికి తన బ్యాట్ ద్వారా కళ్లెం వేశాడు. ధూమ్ ధామ్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. 80 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. క్లాసెన్ కూడా 31 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
క్లాసెన్, ఇషాన్ కిషన్ నాలుగో వికెట్ కు ఏకంగా 97 పరుగులు జోడించారు. తద్వారా 29/3 నుంచి 126/4 వద్దకు చేరుకుంది. కాగా, 80 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ సెంచరీ మార్క్ అందుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ, అతడి ఆశలమీద సాల్ట్ నీళ్లు చల్లాడు. అభినందన్ సింగ్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడాడు ఇషాన్ కిషన్. కానీ, ఆ బంతిని ఆకాశంలో పక్షి మాదిరిగా ఎగిరి సాల్ట్ అందుకున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ వెనుదిరగక తప్పలేదు.
క్లాసెన్ కూడా భారీ షాట్ ఆడాడు. కాకపోతే సాల్ట్ పట్టిన క్యాచ్ ద్వారా క్లాసెన్ ఔట్ అయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న సాల్ట్ అమాంతం క్యాచ్ అందుకున్నాడు. వెంట్రుక వాసిదూరంలో బౌండరీ లైన్ దగ్గర ఉన్నాడు. అమాంతం క్యాచ్ అందుకున్నాడు. అనుమానంగా ఉండటంతో ఫీల్ఢ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ రివ్యూ కోరాడు. అనేక పర్యాయాలు పరిశీలించిన థర్డ్ ఎంపైర్ దానిని ఔట్ గా ప్రకటించాడు. క్లాసెన్ ఔట్ కావడం.. ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరుకోవడంతో ఆ ప్రభావం సన్ రైజర్స్ స్కోరు మీద చూపించింది. వీరిద్దరూ కనుక ఉండి ఉంటే స్కోరు కచ్చితంగా 250కి చేరుకునేది.
చివర్లో అనికేత్ వర్మ(43) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సన్ రైజర్స్ స్కోరు బోర్ వేగంగా దూసుకుపోయింది. అతడు ఔట్ అయినప్పటికీ హైదరాబాద్ లోని మిగతా ప్లేయర్లు దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 201 పరుగులు చేసింది. ఫలితంగా బెంగళూరు ఎదుట టఫ్ టార్గెట్ విధించింది.