https://oktelugu.com/

RCB vs CSK : ఏమయ్యా నీకు ఎంపైరింగ్ వచ్చా..డూ ప్లెసిస్ కు శని లాగా తగులుకున్నావ్.. వైరల్ వీడియో

"ఏమయ్యా నీకు ఎంపైరింగ్ చేయడం వచ్చా.డూ ప్లెసిస్ కు శని లాగా తగులుకున్న వేంటయ్యా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో చెన్నై తొండాట ఆడుతోందని విమర్శిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 18, 2024 / 10:23 PM IST

    Duplessis Out Controversial

    Follow us on

    RCB vs CSK : వర్షం బెంగళూరు జట్టును కొద్దిసేపు ఇబ్బంది పెడితే.. ఆట మొదలైన తర్వాత అంపైర్ తన వివాదాస్పద నిర్ణయంతో మరింత కష్టపెట్టాడు. శనివారం రాత్రి చిన్న స్వామి స్టేడియం వేదికగా చెన్నై, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఇందులో భాగంగా బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్ ను దరిద్రం వెంటాడింది. ఈ మ్యాచ్ లో డూ ప్లెసిస్ అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. 39 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్స్ లతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీతో కలిసి తొలి వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారీ స్కోరు దిశగా కదులుతున్న అతడు.. ఎంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం కారణంగా పెవిలియన్ చేరుకున్నాడు.

    9.4 ఓవర్ వరకు బెంగళూరు 78 పరుగులు చేసింది. ఈ దశలో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అనంతరం రజత్ పాటిదార్ క్రీజ్ లోకి వచ్చాడు. అటు డూ ప్లెసిస్, ఇటు పాటిదార్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో రజత్ ఆడిన ఒక స్ట్రైట్ డ్రైవ్ బౌలర్ చేతిని తాకుతూ, నాన్ స్ట్రైకర్ వికెట్లను పడగొట్టింది. అప్పటికే నాన్ స్ట్రైకర్ గా ఉన్న డూ ప్లెసిస్ బ్యాట్ ను క్రీజు లో పెట్టాడు. కానీ థర్డ్ ఎంపైర్ రిప్లై లో బ్యాట్ నేలను తాకలేదని, గాల్లో ఉందని తేలింది. దీంతో అవుట్ ఇచ్చాడు.. అయితే ఈ నిర్ణయం పట్ల డూ ప్లెసిస్ ఆవేదన వ్యక్తం చేశాడు. అసంతృప్తితో పెవీలియన్ చేరుకున్నాడు.

    డూ ప్లెసిస్ మాత్రమే కాదు, అభిమానులు కూడా థర్డ్ ఎంపైర్ నిర్ణయం పట్ల హతాశులయ్యారు. బ్యాట్ క్రేజు లో పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. గాల్లో ఉందని థర్డ్ ఎంపైర్ నిర్ణయించారు. దానిని అవుట్ గా ప్రకటించారు. అయితే దీని పట్ల బెంగళూరు అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఎలా అవుట్ ఇస్తారని ప్రశ్నించారు.. చెన్నై బౌలర్ మిచెల్ శాంట్నర్ వేసిన 13 ఓవర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ ఓవర్ చివరి బంతిని రజత్ పాటిదర్ స్ట్రైట్ షార్ట్ ఆడాడు. శాంట్నర్ చేతులను తగిలిన ఆ బంతి.. నాన్ స్ట్రైకర్ వికెట్లను పడగొట్టింది.. దీంతో చెన్నై ఆటగాళ్లు రన్ అవుట్ కోసం ఎంపైర్ కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఎంపైర్ థర్డ్ ఎంపైర్ సమీక్ష కోరాడు. థర్డ్ ఎంపైర్ పలు కోణాలలో రిప్లైలను పరిశీలించాడు. డూ ప్లెసిస్ బ్యాట్ గాల్లో ఉందని థర్డ్ ఎంపైర్ నిర్ణయించాడు. దీంతోపాటు ఆల్ట్రా ఎడ్జ్ సహాయంతో బంతి శాంట్నర్ చేతులను తాకినట్టు గుర్తించాడు. స్నీకో మీటర్ తాకినట్టు స్పష్టంగా చెప్పడంతో ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. ఈ నిర్ణయం పట్ల డూ ప్లెసిస్ విచారం వ్యక్తం చేస్తూ, మైదానాన్ని విడిచి వెళ్లిపోయాడు.. థర్డ్ ఎంపైర్ నిర్ణయం పట్ల బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఏమయ్యా నీకు ఎంపైరింగ్ చేయడం వచ్చా.డూ ప్లెసిస్ కు శని లాగా తగులుకున్న వేంటయ్యా” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో చెన్నై తొండాట ఆడుతోందని విమర్శిస్తున్నారు.