IPL 2022- Ravindra Jadeja: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగించింది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఆరింటిలోనే గెలిచి పతకాల పట్టికలో చివరి నుంచి రెండో స్థానం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రవీంద్ర జడేజా పై విమర్శల వాన కురిసింది. కెప్టెన్ గా రాణించలేకపోతున్నాడని నిర్వాహకులు కన్నెర్ర జేశారు. ఫలితంగా కెప్టెన్సీ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. మొదట మహేంద్ర సింగ్ ధోనినే కెప్టెన్ గా పెట్టాలని చూసినా అతడు నిరాకరించంతో జడేజాకు బాధ్యతలు అప్పగించారు. కానీ అతడు తన విధుల్లో సరిగా లేడనే నెపంతో మళ్లీ తప్పించారనే వార్తలు వస్తున్నాయి.
ఈ సీజన్ లో పేలవమైన ప్రదర్శనతో వరుస పరాజయాలు మూటగట్టుకుంది. జడేజా కెప్టెన్సీ గా సరైన విధంగా జట్టును నడిపించడంలో విఫలమయ్యాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో జడేజా పర్ఫార్మెన్స్ పై అనుమానాలు వచ్చిన సందర్భంలో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పుకోమనే ఆదేశాలు సైతం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే నాయకత్వ బాధ్యతల నుంచి దూరం జరిగినట్లు సమాచారం. మళ్లీ ధోనికే పగ్గాలు అప్పగించారు. జడేజా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ తప్పిదాలు చేశాడు. సునాయసంగా నెగ్గాల్సిన మ్యాచులను కూడా కోల్పోవడంతో మేనేజ్ మెంట్ కన్నెర్రజేసింది. కెప్టెన్సీ నుంచి తప్పించింది.
Also Read: Hero Nikhil: తండ్రి కోరిక కోసం తమ్ముడ్ని హీరోని చేస్తున్నాడు !
బౌండరీల వద్ద కూడా ఎంతో క్లిష్టమైన క్యాచులను సునాయాసంగా పట్టే జడేజా ఎన్నో బందులను వదిలేశాడు. ఫలితంగా ప్రత్యర్థి జట్లకు ప్రాణం పోశాడు. దీంతో టీం మేనేజ్ మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కెప్టెన్సీ ఇస్తే ఇలా పరాజయాలు పాలు చేయడం కరెక్ట్ కాదని భావించింది. దీంతోనే జడేజా నాయకత్వంపై నమ్మకం పోయింది. ఇలా చేయడంతో అతడిని కెప్టెన్సీ గా కొనసాగించలేమని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కెప్టెన్సీకి జడేజా దూరమైనట్లు సమాచారం.
గతంలో సచిన్ టెండుల్కర్ కు కూడా కెప్టెన్సీ ఇస్తే సరిగా రాణించలేకపోయాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలంటే చాలా సహనం ఉండాలి. తగిన రీతిలో స్పందించే స్వభావం ఉండాలి. తక్షణమే ఫీల్డింగ్ ను సెట్ చేసే మెరుపులాంటి ఆలోచనలు కావాలి. అవి లేకపోవడంతోనే జడేజా విఫలమైనట్లు తెలుస్తోంది. అయినా కెప్టెన్సీ అంటే మాటలు కాదు చేతల్లో నిరూపించుకోవాలి. విజయం కోసం ప్రతి క్షణాన్ని సద్వినయోగం చేసుకునే సత్తా ఉంటేనే రాణిస్తారు. సో జడేజాకు ఇవేవీ లేకపోవడంతోనే తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదనే తెలుస్తోంది. ఈ మేరకు ఇక ధోని ఎలా వ్యవహరించి జట్టును విజయతీరాలకు చేర్చుతాడో చూడాల్సిందే.
Also Read:NTR- Koratala Siva Film: ఎన్టీఆర్ కోసం ముగ్గురు హీరోయిన్లు.. కొరటాల ఏమి చేస్తాడో ?