Ranbir Kapoor has bought RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 10 జట్లు ఉన్నాయి. ఈ 10 జట్లకు అధిపతులుగా కేవలం కార్పొరేట్ దిగ్గజాలు మాత్రమే లేరు. బాలీవుడ్ స్టార్ నటులు కూడా ఐపీఎల్ లో ఆయా జట్లకు అధిపతులుగా కొనసాగుతున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు యజమానిగా షారుక్ ఖాన్ కొనసాగుతున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సహజమానిగా ప్రీతి జింటా ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో మరో బాలీవుడ్ స్టార్ నటుడు రన్బీర్ కపూర్ చేరిపోయాడు.
రన్బీర్ కపూర్ బెంగళూరు జట్టులో దాదాపు 8 శాతం వాటా కొనుగోలు చేశాడు. ఇందులో రెండు శాతం వాటాను దాదాపు 350 కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేశాడు. మిగతా 6% వాటాను స్టేక్ రూపంలో దక్కించుకున్నాడు. బెంగళూరు జట్టులో వాటాను కొనుగోలు చేయడం ద్వారా.. రన్బీర్ కపూర్ షారుక్ ఖాన్, ప్రీతి జింటా సరసన చేరాడు. బెంగళూరు జట్టు గత సీజన్లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. విజేతగా ఆవిర్భవించిన తర్వాత బెంగళూరు జట్టు విలువ అమాంతం పెరిగిపోయింది. బెంగళూరు జట్టును ప్రమోట్ చేస్తున్న కంపెనీ వాటాలను విక్రయించాలని నిర్ణయించుకుంది.
గత సీజన్లో విజేతగా నిలిచిన తర్వాత బెంగళూరు జట్టు విలువ భారీగా పెరిగింది. దీపము ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత తీరుగా బెంగళూరు యాజమాన్యం వ్యవహరించింది. అందువల్లే వాటాలను విక్రయించడం మొదలుపెట్టింది. రన్బీర్ కపూర్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బెంగళూరు జట్టు అంటే మరింత ఇష్టం. పైగా ఇతడికి, విరాట్ కోహ్లీకి బలమైన సంబంధం ఉంది. అందువల్లే అతడు బెంగళూరు జట్టులో 8 శాతం వాటా కొనుగోలు చేశాడు. ఈ కొనుగోలు వెనక విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సీజన్లో బెంగుళూరు జట్టు తరఫున రన్బీర్ కపూర్ ప్రచారం కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
బెంగళూరు జట్టుకు మొదట్లో యజమానిగా విజయ్ మాల్యా వ్యవహరించారు. కొన్ని సంవత్సరాల వరకు బెంగళూరు జట్టును విజయవంతంగా నడిపించారు. ఆ తర్వాత ఆర్థిక అవకతవకులకు పాల్పడిన కేసులు వెలుగులోకి రావడంతో విజయ్ మాల్యా ఒక్కసారిగా బెంగళూరు జట్టుకు దూరం కావలసి వచ్చింది. ఇప్పుడు బెంగళూరు జట్టును ఓ విదేశీ కంపెనీ ప్రమోట్ చేస్తోంది. ఇప్పుడు ఆ జట్టు విలువ పెరిగిపోయిన నేపథ్యంలో వాటాలను విక్రయించడం మొదలుపెట్టింది. ఈ వాటాలలో 8 శాతాన్ని రన్బీర్ కపూర్ కొనుగోలు చేయడం విశేషం.