Ramiz Raja insults Babar: ఏనుగు నెత్తిమీద ఎవరూ దుమ్ము పోయాల్సిన అవసరం లేదు. తన తొండంతో తానే నెత్తిన దుమ్ము పోసుకుంటుంది. కొన్ని సందర్భాలలో వెర్రి తలకెక్కి తన ప్రాణాలు తానే తీసుకుంటుంది. పాకిస్తాన్ జట్టు మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత ఆటగాళ్లు కూడా ఏనుగు మాదిరిగానే వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే వారి పరువు వారే తీసుకుంటారు. ఇతరులకు ఏమాత్రం అవకాశం ఇవ్వరు. అది తెలిసి చేస్తుంటారా? తెలియక చేస్తుంటారా? అనే విషయాలను పక్కన పెడితే.. తమ ఇజ్జత్ మాత్రం తామే పోగొట్టుకుంటారు. దానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.
పాకిస్తాన్ జట్టులో రమీజ్ రాజా ఒకప్పుడు గొప్ప క్రికెటర్ గా వెలుగు వెలిగాడు. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు నాయకుడిగా ఉన్నప్పుడు బాబర్ అజాం ను విపరీతంగా ఎంకరేజ్ చేశాడు. అతడిని భావి నాయకుడిగా పేర్కొన్నాడు. అతడి ఆధ్వర్యంలో పాకిస్తాన్ జట్టు గొప్పగా ఎదుగుతుందని వ్యాఖ్యానించాడు. అంతేకాదు అతడిని పాకిస్తాన్ జట్టుకు నాయకుడిని కూడా చేశాడు. అయితే ఒకప్పుడు బాబర్ లో రమీజ్ కు గొప్ప లక్షణాలు కనిపించాయి. కానీ ఇప్పుడు బాబర్ అంటేనే రమీజ్ ఒంటి కాలు మీద లేస్తున్నాడు. పైగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. చివరికి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా బాబర్ ను వదిలిపెట్టడం లేదు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా పాకిస్తాన్ దేశంలో పర్యటిస్తోంది. లాహోర్ వేదికగా దక్షిణాఫ్రికా, మధ్య టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ఓపెనర్ హక్ 93, మసూద్ 76 పరుగులతో అదరగొట్టారు. మహమ్మద్ రిజ్వాన్ 62*, సల్మాన్ ఆఘా 52* పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.. అయితే ఈ మ్యాచ్లో సీనియర్ ఆటగాడు బాబర్ 23 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అతనికి మెరుగైన ఆరంభం లభించినప్పటికీ చివరిదాకా నిలబడలేకపోయాడు. అంతే కాదు అతడు 23 పరుగులు చేయడంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఆసియా దేశాల తరఫున ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 3000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్లో బాబర్ ఒక పరుగు వద్ద ఉన్నప్పుడు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ ముత్తుస్వామి 48.1 ఓవర్లో వేసిన బంతిని ఎదుర్కోవడంలో బాబర్ విఫలమయ్యాడు. ముత్తుస్వామి వేసిన బంతి బాబర్ బ్యాట్ తగిలినట్టు అనిపించడంతో సఫారీ ఆటగాళ్లు ఎంపైర్ రివ్యూ తీసుకున్నారు. సమీక్షలో బాబర్ కు అనుకూలంగా ఫలితం వచ్చింది. అయితే ఈ వ్యవహారాన్ని రమీజ్ వదిలిపెట్టలేదు. కామెంట్రీ సెక్షన్లో ఉన్న అతడు మైక్ ఆఫ్ లో ఉందనుకొని అడ్డగోలుగా మాట్లాడాడు.. బాబర్ డ్రామా చేస్తాడని.. ఈ రివ్యూ వృధా అవుతుందని.. అది కచ్చితంగా అవుట్ అని పేర్కొన్నాడు. అయితే అతను మాట్లాడిన మాటలు రికార్డు కావడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. సొంత జట్టు ఆటగాడి విషయంలో రమీజ్ అలా మాట్లాడడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.
Ramiz raja trolling Babar Azam “ye out hoga to drama karega” #PAKvSA #BabarAzam pic.twitter.com/Lde4bp0xX3
— Qudart_Ka_Nizaam____93000 (@43_49_53_all0ut) October 12, 2025