Chandrababu serious: ఏపీలో( Andhra Pradesh) కూటమిలో చాలామంది ఎమ్మెల్యేల తీరుపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఆది నుంచి కొందరు మీరు ఎంత మాత్రం సహేతుకంగా లేదు. ప్రధానంగా తొలిసారి ఎమ్మెల్యేలు అయినవారిలో చాలామంది పై ఆరోపణలు వస్తున్నాయి. పనితీరు మార్చుకోవాలని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు. కానీ వారు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆయన వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగా ఉంది. చిత్తూరు జిల్లాలో తన ప్రాణమిత్రుడు అయిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు కావడంతో చూసి చూడనట్టుగా చంద్రబాబు ఉంటూ వస్తున్నారు. కానీ రోజురోజుకు ఆయన వ్యవహార శైలి వివాదాస్పదం అవుతోంది.
సెల్ఫీ వీడియో కలకలం
తాజాగా జనసేన మాజీ నేత కోట వినుత డ్రైవర్ రాయుడు( driver rayudu) సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినుత ప్రైవేటు వీడియోలు ఇస్తే 30 లక్షలు ఇస్తానంటూ సుధీర్ రెడ్డి బేరం పెట్టారని.. అయితే తాను వినుత దంపతులకు అడ్డంగా దొరికిపోయానని రాయుడు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ ప్రైవేటు వీడియోల మూలంగానే రాయుడును హత్య చేశారు వినుత దంపతులు. అయితే రాయుడు హత్యకు ప్రధాన కారకుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా మారింది. బొజ్జల సుధీర్ రెడ్డి సీఎం చంద్రబాబు హిట్ లిస్టులో చేరిపోయారన్న టాక్ కూడా వినిపిస్తోంది. చంద్రబాబు ఎప్పటికప్పుడు మందలించినా ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు.
ప్రారంభం నుంచి వివాదాలు..
ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రారంభంలోనే టిడిపి( Telugu Desam Party) అనుకూల మీడియా విలేకరిని బెదిరించారన్న టాక్ వినిపించింది. మొన్నటికి మొన్న ఓ పోలీస్ అధికారి బదిలీ విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఆరోపణలు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఓ స్క్రాప్ వ్యాపారిని ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయి అన్న ఆరోపణలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు తో పాటు లోకేష్ కు ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ నాయుడు 100 పేజీల లేఖ ద్వారా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలను, విమర్శలను పార్టీ హైకమాండ్కు తెలియజేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తన స్నేహితుడు బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని దృష్టిలో పెట్టుకొని ఉదాసీనంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే రోజురోజుకు సుధీర్ రెడ్డి వివాదాల్లో కూరుకుపోవడంతో చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.