MS Dhoni – Ram Charan : ఎంఎస్ ధోనితో రాంచరణ్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే.. వైరల్ పిక్

అలా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలని సద్వినియోగ పరుచుకుంటూ చిన్న చిన్నగా ఎదిగి ఆ తర్వాత ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్న నటులలో వెన్నెల కిషోర్ ఒకరు.

Written By: NARESH, Updated On : October 4, 2023 5:40 pm

Ms dhoni Ram charan

Follow us on

MS Dhoni – Ram Charan :  ప్రపంచం లోనే అత్యుత్తమైన కెప్టెన్ ఎవరు అంటే అది ధోని అనే చెబుతాం ఎందుకంటే ఆయన ఇండియా టీం కి చాలా కప్పులను అందించి ఆయన సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాంటి ధోని ఐసీసీ నిర్వహించిన అన్ని కప్పులు కొట్టి ఇండియన్ టీం సత్తా ఏంటో అందరికి చూపించాడు.ఇక ప్రస్తుతం ధోని ఐపీఎల్ మినిహాయిస్తే మిగిలిన అన్ని ఫార్మాట్ల కి కూడా రిటైర్ మెంట్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

కానీ ఆయన ఇండియా టీం నుంచి రెటైర్ అయిన కూడా ఆయన లేని లోటు ఇండియన్ టీం లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది.అందుకే ధోని అంటే ఒక సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనే చెప్పాలి.అలాగే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని అంచనా వేసి వాళ్ళని మన బౌలర్లతో బోల్తా కొట్టిస్తాడు. అలాగే తన బ్యాట్ తో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తాడు. అలాంటి ధోని ఇప్పుడు మైదానం లో కనిపించకపోయే సరికి ధోని ఫ్యాన్స్ అనే కాదు యావత్ ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా చాలా భాదపడుతున్నారు…

ఇక ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ముంబై వెళ్ళాడు. సిద్ధివినాయక టెంపుల్ ని దర్శించుకోవడానికి వెళ్లిన రామ్ చరణ్ ధోని తో కలిసి ఒక ఫోటో దిగడం జరిగింది.ఇక ఆ ఫోటో ఇప్పుడు నెట్ లో తెగ వైరల్ అవుతుంది.నిజానికి రామ్ చరణ్ ధోని ని ఎందుకు కలిసాడు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు కానీ వీళ్లిద్దరు కలిసి ఫోటో దిగడం చూస్తున్న ధోని రామ్ చరణ్ అభిమానులు మాత్రం చాలా సంతోష పడుతున్నారు అయితే వీళ్లిద్దరు 2009 లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఒక కూల్ డ్రింక్ కి యాడ్ లో కలిసి నటించడం జరిగింది.దాని తర్వాత మళ్లీ వీళ్లిద్దరు కలిసి కనిపించడం ఇదే మొదటి సారి…

ధోని రీసెంట్ గా సినిమాలను ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడు కాబట్టి రామ్ చరణ్ హీరో గా ఏదైనా భారీ బడ్జెట్ సినిమాని ప్రొడ్యూస్ చేసే పనిలో ధోని ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆర్ అర్ అర్ సినిమా తో పాన్ ఇండియా హీరో గా ఎదిగాడు కాబట్టి ధోనీ ఆయనతో ఒక సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు అంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు…ఇది కనక వర్క్ అవుట్ అయితే నిజంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని మరికొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు…ఇక రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు దానికి తోడు ప్రస్తుతం ఆయన చేస్తున్న గేమ్ చెంజర్ సినిమా కూడా షూటింగ్ రెగ్యులర్ గా జరగకుండా పోస్ట్ పోన్ అవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ వీళ్ళ కాంబో లో సినిమా ఉంటే అది ఇంకా వన్ ఇయర్ తర్వాత సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది…