Homeక్రీడలుక్రికెట్‌Rajasthan Royals vs Mumbai Indians: రోహిత్ ను ఇలా పగ బట్టావ్ ఏంటి బ్రో.....

Rajasthan Royals vs Mumbai Indians: రోహిత్ ను ఇలా పగ బట్టావ్ ఏంటి బ్రో.. ఎందుకింత కోపం.. ఇంత దారుణంగానా

Rajasthan Royals vs Mumbai Indians: గౌహతిలో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విధ్వంసం సృష్టించింది. 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు మైదానంలో వీరవిహారం చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్ 77, సూర్య వంశీ 39 పరుగులు చేశారు. వీరిద్దరూ ముంబై బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. బుమ్రా నుంచి మొదలు పెడితే చాహర్ వరకు ఎవరినీ వదిలిపెట్టలేదు. తొలి వికెట్ కు వీరిద్దరూ కేవలం 30 బంతుల్లో 80 పరుగులు చేశారంటే వారి దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు

వీరిద్దరూ చూపించిన దూకుడు వల్ల రాజస్థాన్ జట్టు 11 ఓవర్లలో 150 పరుగులు చేయగలిగింది. ముంబై ముందు 151 పరుగుల టార్గెట్ విధించింది. రికెల్టన్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, రోహిత్ శర్మ, నమన్ దీర్ లాంటి బ్యాటర్లు ఉన్న నేపథ్యంలో ముంబై జట్టు ఈస్కోరు ఈజీగా చేజ్ చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ రాజస్థాన్ బౌలర్లు ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ వేసి రాజస్థాన్ జట్టుకు ప్రారంభం నుంచే లీడ్ అందించడం మొదలుపెట్టాడు. రోహిత్ వికెట్ పడగొట్టి మ్యాచ్ మొత్తాన్ని మార్చేశాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్ వికెట్ పడగొట్టి ముంబై జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.. సందీప్ శర్మ రోహిత్ శర్మ అవుట్ చేయడం ఇదే తొలిసారి కాదు.. ఐపీఎల్ చరిత్రలో ఆరుసార్లు రోహిత్ ను అవుట్ చేశాడు సందీప్ శర్మ. సందీప్ శర్మ బౌలింగ్ వైవిధ్యంగా ఉంటుంది. దానిని అర్థం చేసుకొని ఆడితేనే బ్యాటర్ నిలబడగలుగుతాడు. బంతి గమనాన్ని అంచనా వేయకుండా ముందుకు వెళ్తే ఫలితం అనుభవించాల్సి వస్తుంది. మంగళవారం నాటి మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ ఇదేవిధంగా ఇబ్బంది పడ్డాడు. వికెట్ల ముందు దొరికిపోయి నిరాశగా మైదానం నుంచి వెళ్లిపోయాడు.

రోహిత్ శర్మ మాత్రమే కాదు విరాట్ కోహ్లీ కూడా సందీప్ దాదాపు 7 సార్లు అవుట్ చేశాడు.. సందీప్ బౌలింగ్ లో ఆడేందుకు అటు విరాట్.. ఇటు రోహిత్ ఇబ్బంది పడతారు. ఎందుకంటే అతడు పుల్లర్ లెంత్ బంతులు వేస్తాడు. అవి ఊరిస్తూ ముందుకు వస్తాయి. బ్యాట్ తగలగానే గాల్లోకి లేస్తాయి. ఒకవేళ అప్పర్ కట్ షార్ట్ ఆడాలి అనుకుంటే.. ఆటగాడు వికెట్ల ముందు దొరికిపోతాడు. మంగళవారం జరిగిన మ్యాచ్లో కూడా రోహిత్ ఇలానే అవుట్ అయ్యాడు. అటు విరాట్.. ఇట రోహిత్ కు ఒక పీడకల లాగా మారిపోయాడు సందీప్ శర్మ. అందువల్లే అతడిని మిస్టీరియస్ బౌలర్ అని పిలుస్తుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version