Rafael Nadal: ఆధునిక టెన్నిస్ ప్రపంచంలో దిగ్గజ ఆటగాళ్లు ఎంతమందైనా ఉండవచ్చు. వారు ఎన్ని గ్రాండ్ స్లామ్ లైనా గెలవవచ్చు. కానీ రఫెల్ నాదల్ ఆ జాబితాలో ప్రత్యేకం. అతని ఆట తీరు కూడా ప్రత్యేకం. మట్టి కోర్టులో అతడు మొనగాడు. రాకెట్ ను ఆయుధంగా పట్టి టెన్నిస్ యుద్ధాలు చేసిన యోధుడు.. వీరోచితంగా.. హీరోచితంగా ఆటను సరికొత్తగా ప్రదర్శించిన ఈ కాలపు అసమాన్యుడు. అటువంటి ఆటగాడు ఇకపై విశ్రాంతి తీసుకోబోతున్నాడు. తన శకానికి ముగింపు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. వచ్చేనెల డేవిస్ కప్ ఫైనల్స్ లో తలపడి.. ఆ తర్వాత టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతాడు.
23 సంవత్సరాల సుదీర్ఘ కెరియర్
రఫెల్ నాదల్ 23 సంవత్సరాల సుదీర్ఘ కెరియర్ కొనసాగించాడు.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అతడు ఈ స్థాయి దాకా వచ్చాడు. తన శక్తిని, తన యుక్తిని నమ్ముకుని టెన్నిస్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించాడు. అమెరికన్ల ఆధిపత్యానికి గండి కొట్టాడు. మట్టి కోర్టులో మొనగాడిగా ఆవిర్భవించాడు. ఏకంగా 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. ఇవే కాక ఇంకా ఎన్నో ఘనతలను దక్కించుకున్నాడు. వీటన్నింటికీ మించి తనదైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. శరీరం సహకరించడం లేదో.. గాయాలు ఇబ్బంది పెడుతున్నాయో.. కారణాలు ఏంటో తెలియదు గాని.. తన సుదీర్ఘమైన ఆటకు నాదల్ వీడ్కోలు పలికాడు. మెడిసిన్ ఎంత గొప్పదైనా.. దానికంటూ ఎక్స్పైరీ ఉంటుంది. నాదల్ కూడా అలాగే తన ఆటకు ముగింపు పలికాడు. వచ్చే నెలలో డేవిస్ కప్ ఫైనల్స్ తర్వాత రిటైర్ అవుతానని నాదల్ ప్రకటించాడు. నాదల్ కొంతకాలంగా గా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఆ సమయంలోనే ఆటకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయంపై ఇంట్లో వాళ్ళతో చర్చిస్తే.. వాళ్లు కూడా రిటర్మెంట్ వైపే ముగ్గు చూపించారు. వచ్చే నెలలో స్వదేశంలో డేవిస్ కప్ ఫైనల్స్ జరుగుతుంది. అందులో ఆడి టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతానని రఫెల్ నాదల్ వెల్లడించాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాలలో భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు.
రఫా ఏమన్నాడంటే..
” ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నా. గాయాల వల్ల గడిచిన రెండు సంవత్సరాలు చాలా కఠినంగా గడిచాయి. ఇకపై మునుపటిలాగా ఆడే అవకాశం లేదు. శరీరం దానికి సహకరించడం లేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ జీవితంలో ఎన్నో సాధించాను. మరెన్నో చూసాను. ప్రతి దానికి ఒక ఆరంభం ఉన్నట్టే.. ముగింపు కూడా ఉంటుంది. ఇది నేను ఊహించని సుదీర్ఘమైన కెరియర్. నేను అత్యంత విజయవంతంగా నా ఆటను ముగించడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. నా దేశం కోసం చివరిగా డేవిస్ కప్ లో ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నాను. ప్రొఫెషనల్ ఆటగాడిగా.. నేను సాధించిన తొలి పెద్ద విజయం కూడా 2004 డేవిస్ ఫైనల్ లో లభించింది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎన్నో అనుభవాలను పొందాను. నేను కోరుకున్న కల ప్రతి ఒక్కటీ నిజమైంది. నా అత్యుత్తమ ప్రదర్శన చేశానని భావిస్తున్నానని” నాదల్ ప్రకటించాడు.
2001లో..
అనాధలు 2001లో ప్రొఫెషనల్ ఆటగాడిగా మారాడు. ప్రస్తుతం అతడి వయసు 38 సంవత్సరాలు. దాదాపు 23 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ కొనసాగించాడు.. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో 14 సార్లు విజేతగా నిలిచాడు. నాలుగు సార్లు యూఎస్ ఓపెన్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియన్, వింబుల్డన్ ట్రోఫీలను రెండుసార్లు దక్కించుకున్నాడు. కొంతకాలంగా అతడు గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఏడాది చివరిగా పారిస్ ఒలింపిక్స్ లో ఆడాడు. ఒలింపిక్స్ లో నాదల్ 2008లో సింగిల్స్, 2016లో డబుల్స్ లో స్వర్ణాలు దక్కించుకున్నాడు. ఇక వచ్చే నెల నవంబర్ 19 నుంచి 24 వరకు డేవిస్ కప్ లో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్ లు కొనసాగుతాయి. ఈ ఫైనాన్స్ ద్వారా నాదల్ తన కెరియర్ కు ఎండ్ కార్డు వేస్తాడు. కాగా, ఇప్పటివరకు నాదల్ 135 మిలియన్ డాలర్లను నగదు బహుమతిగా పొందాడు. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ దక్కించుకున్నాడు.. అత్యధికంగా టైటిల్స్ సాధించిన ఆటగాళ్లలో జకో విచ్(24) తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు.
సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిల్స్
ఫ్రెంచ్ ఓపెన్ లో నాదల్ 14 టైటిల్స్ సాధించాడు. 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022 సంవత్సరాలలో అతడు విజేతగా నిలిచాడు.
యూఎస్ ఓపెన్: 4(2010, 2013, 2017, 2019)
వింబుల్డన్: 2(2008, 2010)
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2:(2009, 2022).
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Rafael nadal announced his retirement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com