https://oktelugu.com/

PV Sindhu: తెలుగుతేజం పీవీ సింధు సాధించింది

PV Sindhu: తెలుగు తేజం పీవీ సింధు ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. దీంతో ఆమె పేరు మారుమోగింది. అప్పటి నుంచి పెద్ద టోర్నీలు ఆడలేకపోయింది. సూపర్ 300 కేటగిరీ టోర్నీల్లో ప్రతిభ కనబరచింది. స్విస్ ఓపెన్, సయ్యద్ మోడి కప్ లను సొంతం చేసుకుంది. సూపర్ 500 టోర్నీలో ఆదివారం జరిగిన సింగపూర్ ఓపెన్ లో చాంపియన్ గా నిలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు 21-9,11-21, 21-15 తో […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 17, 2022 / 05:05 PM IST
    Follow us on

    PV Sindhu: తెలుగు తేజం పీవీ సింధు ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. దీంతో ఆమె పేరు మారుమోగింది. అప్పటి నుంచి పెద్ద టోర్నీలు ఆడలేకపోయింది. సూపర్ 300 కేటగిరీ టోర్నీల్లో ప్రతిభ కనబరచింది. స్విస్ ఓపెన్, సయ్యద్ మోడి కప్ లను సొంతం చేసుకుంది. సూపర్ 500 టోర్నీలో ఆదివారం జరిగిన సింగపూర్ ఓపెన్ లో చాంపియన్ గా నిలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు 21-9,11-21, 21-15 తో చైనా షట్లర్ వాంగ్ జి యిపై పైచేయి సాధించింది.

    PV Sindhu

    58 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో సింధు ప్రత్యర్థిపై గెలిచి కప్ కైవసం చేసుకుంది. ఆట ప్రారంభం నుంచే సింధు ఆధిపత్యాన్ని ప్రదర్శించి ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేసింది. దీంతో రెండో గేమ్ లో సింధుపై వాంగ్ జి యి పైచేయి సాధించిది. ఈ క్రమంలో మూడో గేమ్ లో ఇక ఆమెకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయి ఆడింది. దీంతో తొలి సూపర్ 500 టైటిల్ ను నెగ్గి చరిత్ర సృష్టించింది. గతంలో కూడా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ పోటీల్లో కూడా వాంగ్ జి యిపై వరుస గేముల్లో విజయం సాధించడం విశేషం.

    Also Read: Mehreen Pirzada: 26 ఏళ్ళ హీరోయిన్ తో బాలయ్య – వెంకీ రొమాన్స్.. మధ్యలో రవితేజ కూడా !

    అంతకుముందు జరిగిన సెమీ ఫైనల్ లో సింధు జపాన్ క్రీడాకారిణి కవాకమిపై విజయం సాధించింది. ఫైనల్ లో వాంగ్ జి యి పై గెలిచి కప్ గెలుచుకుంది. సూపర్ 500 టోర్నీలో చాంపియన్ గా నిలిచి కొత్త అధ్యాయానికి తెర తీసింది. టోక్యో ఒలింపిక్స్ తరువాత చెప్పుకోదగ్గ టోర్నీలు ఆడకపోయినా ఇప్పుడు గెలిచిన దాంతో నూతన శకానికి నాంది పలికింది. ఇన్నాళ్లుగా సూపర్ 500 మ్యాచ్ లో విజయం సాధించని సింధు ఇందులో పైచేయి సాధించి అందరి ప్రశంసలు అందుకుంది.

    PV Sindhu

    ఇంకా భవిష్యత్ లో కూడా సింధు మరిన్ని విజయాలు నమోదు చేసుకుని దేశానికి వెన్నెముకగా నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. తెలుగు వారి కీర్తి దశదిశలా చాటాలని భావిస్తున్నారు. మరిన్ని చాంపియన్ షిప్ లు గెలుచుకుని మన ఘనత చాటాలని కోరుకుంటున్నారు. మళ్లీ ఒలింపిక్స్ లో పతకం సాధించేందుకు ముమ్మరంగా కసరత్తు చేసి స్వర్ణ పతకం సాధించాలని ఆశిస్తున్నారు. సో సింధు అభిమానుల కోరిక నెరవేర్చడానికి కృషి చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

    Also Read:Pawan Kalyan – Amitabh Bachchan: ‘పవన్ కళ్యాణ్ – అమితాబ్’ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్.. డైరెక్టర్ ఆ స్టారే !

    Tags