https://oktelugu.com/

Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు టీమిండియా క్రికెటర్ల స్టెప్పులు.. పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా?

Pushpa Srivalli Dance: పుష్ప సినిమా ఖ్యాతి ఖండాతరాలు దాటుతోంది. అందులోని పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. తెలుగులోనే కాదు.. హిందీ, దక్షిణాది భాషల్లోనూ పుష్ప పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనకు.. సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఇప్పటికే ఫిదా అయ్యారు. అందులోని పాటలను పేరడీగా తీసుకొని సోషల్ మీడియాలో డ్యాన్సులు చేస్తూ అలరిస్తున్నారు. పుష్ప సినిమాకు దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం అదిరిపోయింది. ఈ సినిమాలోని అన్ని పాటలకు విశేష స్పందన […]

Written By:
  • NARESH
  • , Updated On : January 16, 2022 / 09:14 AM IST
    Follow us on

    Pushpa Srivalli Dance: పుష్ప సినిమా ఖ్యాతి ఖండాతరాలు దాటుతోంది. అందులోని పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. తెలుగులోనే కాదు.. హిందీ, దక్షిణాది భాషల్లోనూ పుష్ప పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనకు.. సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఇప్పటికే ఫిదా అయ్యారు. అందులోని పాటలను పేరడీగా తీసుకొని సోషల్ మీడియాలో డ్యాన్సులు చేస్తూ అలరిస్తున్నారు.

    పుష్ప సినిమాకు దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం అదిరిపోయింది. ఈ సినిమాలోని అన్ని పాటలకు విశేష స్పందన వచ్చింది. అంతేకాదు.. ఈ సినిమాలో పాటల క్రేజ్ ఇప్పటికే దేశాలు దాటిపోయింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాటకు బన్నీ వేసిన స్టెప్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ స్టెప్ వేస్తూ చాలా మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

    తాజాగా టీమిండియా క్రికెటర్లు కూడా శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేశారు. అచ్చం బన్నీ స్టైల్ లో స్పెప్పులు వేసి అదరగొట్టారు. టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తాజాగా శ్రీవల్లి పాట స్టెప్ ను వేసి ఆకట్టుకున్నారు. హిందీ వెర్షన్ కు అచ్చం అల్లు అర్జున్ లా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    ఇప్పటికే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదేలే అనే డైలాగ్ ను రవీంద్ర జడేజా.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ లు అల్లు అర్జున్ స్టైల్ లో చెప్పి ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. దీంతో పుష్ప క్రేజ్ విశ్వవ్యాప్తమవుతోంది.