Punjab Vs Gujarat: ఐపీఎల్ అంటే కేవలం బ్యాట్ ద్వారా లభించే పరుగులు మాత్రమే కాదు.. బంతి ద్వారా వచ్చే వికెట్లు కూడా.. అయితే ఐపీఎల్లో చాలావరకు మ్యాచ్ లలో పరుగుల ప్రవాహం సాగుతూ ఉంటుంది. అరుదైన సందర్భంలో మాత్రమే బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపిస్తారు.
Also Read: ఇక క్వాంటం శకం.. చంద్రబాబు ఆశయం అదే!
ఐపీఎల్ లో బౌలర్ల ప్యారడైజ్ అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. ఈసారి ఐపీఎల్లో అది త్వరగానే చోటుచేసుకుంది. మంగళవారం పంజాబ్, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బౌలర్ల ఆధిపత్యం సంపూర్ణంగా కనిపించింది. ఓ మాదిరి పరుగులు నమోదైన ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
పంజాబ్ జట్టులో కెప్టెన్ అయ్యర్ విఫలమైనప్పటికీ.. ప్రమాదకరమైన ప్రియాంష్ ఆర్య చేతులెత్తేసినప్పటికీ.. కూపర్ (72*) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. కూపర్ 44 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు.. ఐదు సిక్సర్లతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.. పంజాబ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గిల్ 39, బట్లర్ 38, ఫిలిప్స్ 25 పరుగులు చేశారు. వైశాక్ మూడు వికెట్లు పడగొట్టాడు. చాహల్ 2 వికెట్లు సాధించాడు.. ఆ తర్వాత టార్గెట్ చేజింగ్ లో పంజాబ్ జట్టు 19.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రాన్ 37 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కూపర్ 72* పరుగులతో అదరగొట్టాడు. గుజరాత్ బౌలర్ ప్రసిద్ కృష్ణకు మూడు వికెట్లు లభించాయి.
టార్గెట్ ఒక మాదిరిది అయినప్పటికీ.. పంజాబ్ జట్టుకు గట్టి ఆరంభం లభించలేదు. ప్రియాంష్ ఏడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో గుజరాత్ బౌలర్ల దూకుడు ముందు పంజాబ్ జట్టుకు ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. అయితే ఈ దశలో కూపర్ గట్టిగా నిలబడ్డాడు. ఆపద్బాంధవుడు పాత్ర పోషించాడు.. ఇతడికి ప్రభ్ సిమ్రాన్ అండగా నిలిచాడు.
గుజరాత్ బౌలర్ రబాడ వేసిన నాలుగో ఓవర్ లో ప్రభ్ సిమ్రాన్, కూపర్ రెచ్చిపోయారు. 19 పరుగులు పిండుకున్నారు. మరుసటి ఓవర్ లో కూడా వీరిద్దరు 13 పరుగులు సాధించారు. పవర్ ప్లే లో పంజాబ్ జట్టు ఏకంగా 55 పరుగులు చేసింది. సిమ్రాన్ అవుట్ కావడంతో.. పంజాబ్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది.. అయ్యర్ కూడా విఫలం కావడంతో.. జాబ్ జట్టు కష్టాలు మరింత పెరిగాయి. ఈ దశలో కూపర్ గట్టిగా నిలబడ్డాడు. సమర్థవంతంగా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు.
