PSL 2025: ఇండియాతో ఫైరింగ్.. ఇతర వివాదాలు కాస్త పక్కన పెడితే.. ఐపీఎల్ ను చూసి.. కాపీ కొట్టి నిర్వహిస్తున్న పిసిఎల్ విషయంలోనూ దాయాది దేశం అడ్డగోలుగా వ్యవహరించింది. చివరికి ఆటగాళ్ల ప్రాణాలను కూడా తన రెవెన్యూ కోసం పణంగా పెట్టడానికి సిద్ధమైంది. విదేశీ ప్లేయర్లు ఆడబోమని.. ఆడలేమని స్పష్టం చేయడంతో పి సి బి తలవంచుకుంది. తలదించుకొని.. ప్లేయర్లను దుబాయ్ పంపించింది. అక్కడ నుంచి వారి వారి డెస్టినేషన్లకు పంపించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ వచ్చాడు. అతడైతే జన్మలో పాకిస్తాన్ కు రాలేనని స్పష్టం చేశాడు. ఇక ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ టామ్ కుర్రాన్ చిన్నపిల్లాడిలాగా వెక్కివెక్కి ఏడ్చాడు. ఈనెల 7వ తేదీ నుంచి ఇండియా – పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో పిఎస్ఎల్ నిరవధికంగా వాయిదా పడింది.. అయితే ఈ మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించాలని పిసిబి నిర్ణయించింది. కానీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఈ ఆఫర్ ను తిరస్కరించింది. దీంతో ఈ టోర్నీని రద్దు చేయడం మినహా మరో ఆలోచన పీసీబీ కి లేకపోయింది.. వాస్తవానికి ఐపీఎల్ విషయంలో బీసీసీఐ వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది.. అది క్షణాల వ్యవధిలోనే అమల్లోకి వచ్చింది. అదే కాదు మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చాయి. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఏ దేశం కూడా ముందుకు రాలేదు..
Also Read: విరాట్ కోహ్లీ రిక్వెస్ట్ చేస్తే.. బీసీసీఐ పెద్దలు ఏహే పో అన్నారా?!
దుబాయ్ నుంచి..
ఎమైరేట్స్ క్రికెట్ బోర్డు పి సి బి కి హ్యాండ్ ఇచ్చింది. వాస్తవానికి ఈసీబీ మీద పిసిబి బోలెడు ఆశలు పెట్టుకుంది. మిగతా మ్యాచులు నిర్వహిస్తామని భావించింది.. దుబాయ్ వేదికగా ఇవన్నీ జరుపుదామని గప్పాలు కొట్టుకుంది. అయితే ఈ సి బి సడన్ గా హ్యాండ్ ఇవ్వడంతో గత్యంతరం లేక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విదేశీ ప్లేయర్లను దుబాయ్ తరలించింది.. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ల ద్వారా వారి వారి గమ్యస్థానాలకు పంపించింది. దీనికంటే ముందు పిసిబి లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిగతా మ్యాచ్లలో విదేశీ ప్లేయర్లను ఆడించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొగ్గుచూపింది. కానీ విదేశీ ప్లేయర్లు దీనికి ఒప్పుకోలేదు. పిసిబి చైర్మన్ ఎంతగా బతిమిలాడినప్పటికీ విదేశీ ప్లేయర్లు లొంగలేదు. ఇక పాకిస్తాన్ నుంచి దుబాయ్ దాకా వెళ్ళిన విదేశీ ప్లేయర్లలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ టామ్ కుర్రాన్ వెక్కివెక్కి ఏడ్చాడు. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ జన్మలో పాకిస్తాన్ రానని శపథం చేశాడు. వాస్తవానికి వీరు దుబాయ్ బయలుదేరిన అర్థగంటకే.. పాకిస్తాన్ విమానాశ్రయం సమీపంలో క్షిపణి పేలింది. దీంతో ప్లేయర్లు ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సంఘటనను తలుచుకొని ఒక్కసారిగా మదనపడ్డారు. ఇక గతంలో పాకిస్థాన్లో పర్యటించడానికి వచ్చిన శ్రీలంక ప్లేయర్లపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు పాకిస్తాన్ దేశంలో ఏ జట్టు కూడా పర్యటించలేదు. ఇన్నాళ్లకు పరిస్థితులు కాస్త చక్కబడుతున్నప్పటికీ.. భారతదేశంలో పాకిస్తాన్ అనవసరంగా గోక్కోవడం వల్ల యుద్ధం మొదలైంది.