Homeక్రీడలుAsia Cup 2023 Team India: ఆసియా కప్‌ ముందు టీమిండియాకు సమస్యలు.. సరి చేసుకుంటేనే...

Asia Cup 2023 Team India: ఆసియా కప్‌ ముందు టీమిండియాకు సమస్యలు.. సరి చేసుకుంటేనే కప్పు!

Asia Cup 2023 Team India: వన్డే క్రికెట్‌ ఫార్మాట్‌లో మరో సిరీస్‌ ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. వన్డే వరల్డ్‌కప్‌కు ముందు జరుగుతున్న ఆసియా కప్‌ సిరీస్‌ విజయం ఏ జట్టుకైనా ఆత్మవిశ్వాసం పెంచుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. ఈ సిరీస్‌లో కీలకమైన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌ జట్లు తలపడనున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌లో తలపడే నాలుగు కీలక జట్లు ఈ సిరీస్‌ ఆడనుండడమే అందుకు కారణం. గతేడాది ఆసియాకప్‌లో భారత్‌ ఫైనల్‌ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది.

ఈనెల 30 నుంచి సిరీస్‌..
ఆసియా కప్‌ 2023 ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు జరగనుంది. భారత్, పాకిస్తాన్, నేపాల్‌ జట్లు గ్రూప్‌ ‘ఎ’లో ఉండగా.. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు గ్రూప్‌ ‘బి’లో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్‌ మధ్య సెప్టెంబర్‌ 2న మ్యాచ్‌ జరగనుంది.

భారత్‌కు ఇవే ప్రధాన సమస్యలు..
మరో వారం రోజుల్లో ఆసియా కప్‌ 2023 ఆరంభం కానుంది. వన్డే ప్రపంచకప్‌ 2023కి ముందు జరుగుతుండటంతో ఆసియా కప్‌ టోర్నీ ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఆసియా కప్‌ ముందు భారత్‌ను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఆసియా కప్‌ అనంతరం వన్డే ప్రపంచకప్‌ కూడా ఉండటంతో ఈ సమస్యలను భారత్‌ త్వరగా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఓపెనింగ్‌ సమస్య..
భారత్‌ ను ఓపెనింగ్‌ సమస్య వేధిస్తోంది. ఐపీఎల్‌ 2023 అనంతరం శుబ్‌మన్‌ గిల్‌ ఫామ్‌ కోల్పోయాడు. ఫ్లాట్‌ పిచ్‌లపై మాత్రం ఆడుతున్నాడు. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. విండీస్‌ పర్యటనలో ఈ సమస్య క్లియర్‌ గా కనిపించింది. ఆసియా కప్‌లో భారత్‌ గెలవాలంటే ఓపెనింగ్‌ సమస్యను పరిష్కరించుకోవాలి.

మిడిలార్డర్‌ కూడా..
కొంత కాలంగా టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ టాప్‌ ఆర్డర్‌ పైనే ఆధారపడుతూ వస్తోంది. టాప్‌ 3 ఆడితినే భారత్‌ చాలా మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తోంది. మిడిలార్డర్‌ పేలవంగా ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ ఆటకు దూరం కావడంతో ఆ సమస్య మరింత ఎక్కువైంది. గాయం నుంచి కోలుకున్న అయ్యర్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఆసియా కప్‌లో భారత్‌ రాణించాలి అంటే మిడిలార్డర్‌ను బలోపేతం చేయాలి.

నిలకడలేని బౌలింగ్‌..
భారత జట్టును బౌలింగ్‌ సమస్య కూడా వేధిస్తోంది. బౌలింగ్‌ లో భారత బౌలర్లు నిలకడ ప్రదర్శించడం లేదు. ఒక మ్యాచ్‌ లో అదరగొడితే మరో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆసియా కప్‌లో భారత్‌ విజేతగా నిలవాలంటే భారత బౌలర్లు నిలకడ ప్రదర్శించాలి.

ఈ సమస్యలను పరిష్కరించుకుంటేనే ఆసికప్‌ చాంపియన్‌గా నిలవడంతోపాటు వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఆసిక కప్‌ను టీమిండియాతోపాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular