Preity Zinta emotional post on team : అభిమానుల్లో నమ్మకం పెంచినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం విఫలమైంది. తొలిసారి టోపీ గెలుచుకుంటామనే సందర్భంలో ఊహించని స్థాయిలో ఓటమిపాలైంది. చారిత్రాత్మకమైన విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయింది అయ్యర్ జట్టు. ఈ ఓటమి తర్వాత అయ్యర్ జట్టు ఆటగాళ్లు ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయారు. 2014 తర్వాత 11 సంవత్సరాల అనంతరం ఇక్కడిదాకా వచ్చినప్పటికీ.. ట్రోఫీ సాధించలేకపోయాం అనే బాధ వారిలో కనిపించింది. అందువల్లే చాలామంది ప్లేయర్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అధిగమించలేక డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయారు. ఇక ప్లేయర్ల పరిస్థితి ఎలా ఉంటే.. దాదాపు దశాబ్దానికి మించిన ఎదురుచూపుతో ఉన్న పంజాబ్ జట్టు ఓనర్లలో ఒకరైన ప్రీతి జింటా పరిస్థితి ఎలా ఉంటుంది.. అసలు ఈ ఓటమిని ఆమె ఎలా స్వీకరించగలుగుతుంది.. ఇప్పటికే జట్టు మీద ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకుంది కదా.. అవి ఫైనల్ మ్యాచ్లో విఫలమయ్యాయి కదా.. ఆమె వీటిని ఎలా స్వీకరిస్తుంది.. అనే ప్రశ్నలు నిన్నటి దాకా వ్యక్తం అయ్యాయి. అయితే ఫైనల్ మ్యాచ్ రోజులు గడుస్తున్న నేపథ్యంలో ప్రీతిజింటా తొలిసారిగా తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా రెస్పాండ్ అయ్యారు.
Also Read : పంజాబ్ ఇక్కడిదాకా రావడంలో ప్రీతిజింటాది ముఖ్యపాత్ర.. జట్టు కోసం ఆమె ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలుసా?
జట్టు ఓటమి నేపథ్యంలో ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. ” 2025లో మేము అనుకున్నట్టుగా ముగింపు రాలేదు. కాకపోతే టీం జర్నీ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అంచనాలు లేని ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేశారు. అనేక కారణాలవల్ల కీలక ఆటగాళ్లను కోల్పోయాము. అయినప్పటికీ మా సారధి జట్టును అద్భుతంగా నడిపించాడు. దాదాపు 10 సంవత్సరాలు అనంతరం ఆ జట్టు టేబుల్ టాపర్ అయ్యింది. మా ప్లేయర్లను చూసి గర్వపడుతున్నాను. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. పేరుపేరునా ధన్యవాదాలు. ఇప్పుడు మాకు అనుకూలంగా లేకపోయినప్పటికీ వచ్చే సీజన్లో మరింత బలంగా తిరిగి వస్తాం. కచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. మా ముందు బలమైన లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి బలమైన అడుగులు వేస్తాం. మా టార్గెట్ రీచ్ కావాలంటే ఇంకా అనేక విధానాలు అవలంబించాలి. మాకు ఉన్న సమయాన్ని వినియోగించుకుంటాం. దానిని గెలుపు దిశలో సాగిస్తామని” ప్రీతి జింటా ఎమోషనల్ పోస్ట్ చేసింది. అయితే ప్రీతిజింటా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతోంది. ఇక పంజాబ్ అభిమానులు ఆమె పోస్టును వైరల్ చేస్తున్నారు. జట్టుకుతాము అండగా ఉంటామని.. కచ్చితంగా వచ్చే సీజన్లో అనుకున్న ఫలితం సాధిస్తామని ఆమెకు భరోసా ఇస్తున్నారు.
ఇక అయ్యర్ నాయకత్వంపై ప్రీతి జింటా సానుకూలమైన ప్రకటన చేసింది. అతని నాయకత్వంలో జట్టు ఎంతగానో పరిణితి సాధించిందని వ్యాఖ్యానించింది. అతడు జట్టును అద్భుతంగా ముందుకు నడిపాడని కొనియాడింది. అతడి సేవలు జట్టుకు ఉత్తమమైన ఫలితాలు అందించాయని పేర్కొంది.
It didn’t end the way we wanted it to but….the journey was spectacular ! It was exciting, entertaining & it was inspiring. I loved the fight & the grit our young team, our shers showed throughout the tournament. I loved the way our captain, our Sarpanch lead from the front &… pic.twitter.com/kUtRs908aS
— Preity G Zinta (@realpreityzinta) June 6, 2025