Homeక్రీడలుక్రికెట్‌Preity Zinta : ఉప్పల్ లో ప్రేమంటే ఇదేరా.. ఆ పాట విని SRH కు...

Preity Zinta : ఉప్పల్ లో ప్రేమంటే ఇదేరా.. ఆ పాట విని SRH కు సపోర్ట్ చేసిన ప్రీతిజింటా..

Preity Zinta : పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రీతి జింటా నవ్వులు చిందించింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. ప్రియాన్ష్ ఆర్య దంచి కొడుతున్నప్పుడు.. ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఊచకోత కోస్తున్నప్పుడు.. లివింగ్ స్టోన్ బంతిని బద్దలు కొట్టేలా ఆడినప్పుడు.. ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేవు. ఆ సమయంలో కావ్య మారన్ ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. ఇదే సమయంలో ప్రీతి జింట నవ్వులతో పువ్వులు పూయించింది. కావ్య హైదరాబాద్ జట్టుకు.. ప్రీతి పంజాబ్ జట్టుకు ఓనర్లుగా ఉన్నారు.. ఓనర్ కాబట్టి సహజంగా తమ జట్లను ఎంకరేజ్ చేయడం వారి విధి.
ఈ మ్యాచ్లో పంజాబ్ పై హైదరాబాద్ గెలిచిన నేపథ్యంలో.. హైదరాబాద్ ఓనర్ కావ్య తన ఆనందాన్ని రకరకాలుగా వ్యక్తం చేశారు. అప్పుడు ప్రీతి కాస్త ముభావంగా ఉన్నారు.. అయినప్పటికీ వెంటనే తేరుకొని.. హైదరాబాద్ ఆటగాళ్లకు అభినందనలు చెప్పారు. ముఖ్యంగా అభిషేక్ శర్మతో ముచ్చటించారు. హైదరాబాద్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో ఉప్పల్ మైదానంలో వెంకటేష్ తో జంటగా ప్రీతి జింటా నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాలో “నైజాం బాబులు, నాటు బాంబులు, అతిధులు మీరండి” అనే పాటను ప్లే చేశారు.. 2000 సంవత్సరంలో విడుదలైన ప్రేమంటే ఇదేరా సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో ఈ పాట సూపర్ హిట్ అయింది.
ఆ సినిమాతో సంబంధం కలిపారు 

హైదరాబాద్ అభిమానులు విక్టరీ వెంకటేష్ ను విపరీతంగా ప్రేమిస్తుంటారు. విక్టరీ వెంకటేష్ కూడా హైదరాబాద్ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్ కు హాజరవుతుంటారు. హైదరాబాద్ జట్టుకు తన సపోర్ట్ ఇస్తుంటారు. టాలీవుడ్ నుంచి పెద్దగా స్టార్లు కనిపించకపోయినప్పటికీ.. విక్టరీ వెంకటేష్ తప్పకుండా హాజరవుతుంటారు. ఆయన మాత్రమే కాదు ఆయన సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు కూడా వస్తుంటారు. తను ఓనర్ కాకపోయినప్పటికీ.. హైదరాబాద్ గడ్డపై ఉన్న మమకారంతో విక్టరీ వెంకటేష్ హైదరాబాద్ జట్టును తన సొంత టీమ్ గా భావిస్తుంటారు. అయితే పంజాబ్ జట్టు హైదరాబాద్ చేతిలో ఓడిపోవడంతో.. ప్రేమంటే ఇదేరా సినిమాలోని సన్నివేశాలను, పాటలను మీమర్స్ తెగ వాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రేమంటే ఇదేరా సినిమాలో విక్టరీ వెంకటేష్ హైదరాబాద్ నుంచి వచ్చిన యువకుడిగా నటిస్తాడు. అందులో ఓ పెళ్లికి వెళ్లి ప్రీతితో ప్రేమలో పడతాడు. విక్టరీ వెంకటేష్ ను సరదాగా ప్రీతి ఆట పట్టిస్తుంది. అయితే ఇప్పుడు అందులో కొన్ని సన్నివేశాలను మీమర్స్ తమకు అనుకూలంగా మనసుకుని.. హైదరాబాద్ జట్టు పంజాబీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని మీమ్స్ రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఇక సందర్భంగా తోడు కావడంతో నెటిజన్లు ఈ మీమ్స్ ను తెగ ఆస్వాదిస్తున్నారు.. కేవలం ప్రేమంటే ఇదేరా మాత్రమే కాదు.. సలార్ సినిమాలో కాటేరమ్మ కొడుకుల్లాగా.. పెద్ది, రంగస్థలం, పుష్ప, కే జి ఎఫ్, ఆర్ ఆర్ ఆర్.. ఇలా ఎన్నో సినిమాల రిఫరెన్స్లను ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐ టీ విభాగం వాడేస్తూనే ఉంది. అయితే శనివారం జరిగిన మ్యాచ్ కు వెంకటేష్ హాజరు కాలేదు. లేకుంటే ప్రీతితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ.. మ్యాచ్ ఎంజాయ్ చేసేవాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version