Prasidh Krishna Wickets: ఇంగ్లాండ్ జట్టుపై లండన్ ఓవల్ మైదానంలో ఐదో టెస్టులో టీమిండియా సాధించిన విజయం మామూలుది కాదు. ఒకానొక దశలో ఇంగ్లాండ్ జట్టు విజయానికి అత్యంత దగ్గరలో ఉంది. ఈ దశలో బ్రూక్, రూట్ అవుట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. రూట్ ను ప్రసిద్ద్ కృష్ణ అవుట్ చేయడంతో మ్యాచ్ భారత్ చేతికి వచ్చింది. ఆ తర్వాత బెతెల్ ను ప్రసిద్ద్ కృష్ణ అవుట్ చేయడంతో ఇంగ్లాండు ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది.
ఐదవరోజు సిరాజ్ వరుసగా జెమీ స్మిత్, ఓవర్టన్ వికెట్లను పడగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు పూర్తిగా భారత జట్టుకు సరెండర్ అయిపోయింది. ఇదే దశలో టంగ్ తో కలిసి ఇంగ్లాండ్ జట్టును గెలిపించాలని అట్కిన్సన్ భావించాడు. దాని తగ్గట్టుగానే సిరాజ్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు గెలుస్తుందా.. భారత జట్టుకు పరాభవం మిగులుతుందా.. అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అయ్యాయి. వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. టంగ్ ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. వాస్తవానికి అతడిని క్లీన్ బౌల్డ్ చేయడంలో ప్రసిద్ద్ కృష్ణ తిరుగులేని స్ట్రాటజీ అమలు చేశాడు.. అది ఇంగ్లాండ్ శిబిరంలో తీవ్రమైన ఆందోళనకు కారణమైంది.
Also Read: క్లీన్ స్వీప్ నుంచి రికార్డులు బద్దలు కొట్టేదాకా.. టీమిండియా యంగ్ ప్లేయర్ల ప్రస్థానం సాగిందిలా..
టంగ్ ను అవుట్ చేయడానికి ముందుగా ప్రసిద్ద్ మైదానంలో అనేక నాటకీయ పరిణామాలకు శ్రీకారం చుట్టాడు. భారీ షాట్ కొడతాడని భావించి ఫీల్డర్లను లాంగ్ ఆన్ లో మోహరించాడు. దీంతో తనకు షార్ట్ పిచ్ బంతి వేస్తాడని టంగ్ అనుకున్నాడు. ప్రసిద్ద్ కూడా అలానే అనిపించాడు. కానీ ఇన్ సైడ్ యార్కర్ వేశాడు. ఆ బంతిని అంచనా వేయలేక టంగ్ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బంతి వేగంగా దూసుకు వచ్చి వికెట్లను పడగొట్టింది. టెస్ట్ క్రికెట్లో బౌలర్లు మూస ధోరణిలో కాకుండా.. ఒకే విధానంలో బౌలింగ్ వేయకుండా.. అప్పుడప్పుడు ఇలా తమ మెదడుకు పని చెప్తే అద్భుతాలు చేయవచ్చని నిరూపించాడు ఈ యువ ఆటగాడు.