Sunrisers Hyderabad Owner Kavya Maran: ఈ 2022 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ అదరగొడుతోంది. మొదట రెండు మ్యాచులతో డీలా పడిపోవడంతో అందరూ ఇక రైజర్స్ పని అయిపోయింది అనుకున్నారు. ఇందుకు కారణం హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప అంటూ భారీగా ట్రోల్స్ చేశారు. ఆమె ఐరన్ లెగ్ అని కొందరు విమర్శిస్తే.. వేలంలో స్టార్ బౌలర్లను, బ్యాటర్లను తీసుకోలేదంటూ విమర్శలు కురిపించారు.

ఇక మూడో మ్యాచ్ చెన్నైతో ఆడుతున్న సమయంలో అయితే ఆమె గ్రౌండ్‌కు రావొద్దని, ఆమె వస్తే ఓడిపోతోందంటూ కామెంట్లు చేశారు. కానీ అదే మ్యాచ్‌లో చెన్నైని మట్టి కరిపించి ఫామ్‌లోకి వచ్చింది. రైజర్స్. ఇక అప్పటి నుంచి విజయాల పరంపరను కొనసాగిస్తోంది. తర్వాత బలమైన గుజరాత్ ను ఓడించి సత్తా చాటింది.
Also Read: KGF Chapter 2: కేజీఎఫ్-2 పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్టులు ఎవరో తెలుసా..?
ఆ తర్వాత కూడా ఇకో రెండు మ్యాచ్‌లను వరుసగా నెగ్గింటి దుమ్ము లేపింది. దీంతో ఇప్పుడు అందరూ కావ్య పాప సూపర్ ట్యాలెంట్ అంటూ పొగుడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఓ కారణం ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి హైదరాబాద్ తరఫున ఆడుతున్న స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఆమె వదిలేయడంతో అందరూ తిట్టారు. కానీ కావ్య మాత్రం కావాలనే అతన్ని రిటైన్ చేసుకోలేదు. ఎందుకంటే అతను రూ.16 కోట్లు అడిగాడంట.

ఒక్క ఆటగాడికే అంత ఖర్చు పెట్టడం ఇష్టం లేక అదే పదహారు కోట్లతో నలుగురు కత్తి లాంటి పేసర్లను కొనుగోలు చేసింది. వారే ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్, నటరాజన్, మార్కో జాన్సన్ లను కలిపి రూ.16 కోట్లకే కొనుగోలు చేసింది. ఈ నలుగురు అద్భుతంగా రాణిస్తున్నారు. పదునైన బౌలింగ్ తో దుమ్ములేపుతున్నారు. అంటే రషీద్ ఖాన్‌ను ఒక్కడినే కొనుగోలు చేస్తే ఇంత మంచి బౌలర్లు మిస్ అయ్యే వారని అంటున్నారు ఫ్యాన్స్. ఎంతైనా కావ్య పాపది మాస్టర్ మైండ్ అంటూ కొనియాడుతున్నారు.
Recommended Videos