SS Rajamouli: సినీ సెలబ్రిటీలు ఎక్కడకు వెళ్లినా.. వారికి ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వారితో ఒక్క సెల్ఫీ తీసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే ఇలా సడెన్ గా రోడ్లపై సామన్యుడిలా తిరిగే వారు చాలామంది ఉంటారు. ప్రస్తుతం రంజాన్ సీజన్ నడుస్తోంది. ఈ రంజాన్ వేళలో చార్మినార్‌ను చూస్తే ఆ కిక్ వేరే లెవల్ అనే చెప్పుకోవాలి. ఆ మజాను దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఎంజాయ్ చేయాలనుకున్నారేమో.

వాస్తవానికి ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి అర్థరాత్రి కూడా షాపింగ్ష్ మాల్స్ నడుస్తుంటాయి. రాత్రి వేళల్లో దగదగ మెరుస్తూ ఉంటుంది చార్మినార్ ప్రాంతం. కాగా ఈ సందడిని మిస్ కావొద్దని లెజెండ్ డైరెక్టర్ రాజమౌళి ఓల్డ్ సిటీలో అర్థరాత్రి ప్రత్యక్షం అయ్యారు. చార్మినార్ పరిసర ప్రాంతాలను ఆయన కలియ తిరిగారు.
Also Read: KGF Chapter 2: కేజీఎఫ్-2 పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్టులు ఎవరో తెలుసా..?
అది కూడా ఒక సామాన్య వ్యక్తిలా తిరగడం ఇక్కడ విశేసం. బజార్ అందాలను చూస్తే రాత్రి వేళల్లో ఆయన ఎంజాయ్ చేశారు. ఇక అతని పర్యటనలో చాలామందిని ఆయన కలిశారు. ఇక స్థానికంగా ఉన్న హోటళ్లలో ఆయన కొడుకు కార్తికేయతో ఫుడ్ ను రుచి చూశారు. అయితే ఆయన పర్యటనలో ఎవరూ పెద్దగా ఆయనను గుర్తించలేదు.

ఒక వ్యక్తి మాత్రం సడెన్ గా గుర్తు పట్టి మీరు రాజమౌళి కదా అని అడిగి సెల్ఫీ దిగాడు. అలా ఒకరి తర్వాత ఒకరు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అంత పెద్ద డైరెక్టర్ అయి ఉండి ఇంత సింపుల్ గా ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక చివరగా ఆయన ఓ హోటల్ లో కొడుకు కార్తికేయతో కలిసి బిర్యానీ తిని వెళ్లిపోయారు.
Also Read:Pawan Kalyan- Sampath Nandi: పవన్ తో పూర్తి చేయగలడా ?.. అసలు పవన్ ఛాన్స్ ఇస్తాడా ?
Recommended Videos