spot_img
Homeక్రీడలుక్రికెట్‌Praful Hinge SRH Bowler Story: తండ్రి వద్దన్నాడు..13 ఏళ్ల వయసులోనే క్రికెట్ లోకి.. ప్రఫుల్...

Praful Hinge SRH Bowler Story: తండ్రి వద్దన్నాడు..13 ఏళ్ల వయసులోనే క్రికెట్ లోకి.. ప్రఫుల్ హింజ్ మామూలోడు కాదు..

Praful Hinge SRH Bowler Story: రాజస్థాన్ రాయల్స్ మీద 34/4 ప్రదర్శన చేయడం ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్ ప్రఫుల్ హింజ్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు.. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ గెలిచిన తర్వాత అతని గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అందులో ఒక అదన మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది.

అందరు అనుకున్నట్టుగా ప్రఫుల్ హింజ్ కు బై లక్ ఛాన్స్ రాలేదు. దాని వెనుక ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంది.. 13 సంవత్సరాల వయసులోనే ప్రఫుల్ హింజ్ క్రికెట్లో ప్రవేశించాడు. లెదర్ బాల్ క్రికెట్ అంటే ఏమిటో అప్పటికి అతడికి తెలియదు. అయినప్పటికీ క్రికెట్లోనే తన భవిష్యత్తు ఉందని నమ్మాడు. అందులోనే తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన తండ్రితో చెబితే కాదన్నాడు. తనను ఒక క్లబ్లో చేర్పించాలని కోరితే.. అతడు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి.. చివరికి క్రికెట్ క్లబ్లో చేర్పించాడు.

ఇక అప్పటినుంచి ప్రఫుల్ హింజ్ కు క్రికెటే లోకమై పోయింది. ప్రఫుల్ హింజ్ ను అతడి తండ్రి ప్రతిరోజు క్లబ్ కు తీసుకెళ్తూ ఉండేవాడు.. మొదట్లో బ్యాటింగ్ అంటే ఇష్టం ఉండేది.. ఆ తర్వాత బౌలింగ్ వైపు మళ్లిపోయింది. కుడి చేతివాటం బౌలింగ్ వేసే ప్రఫుల్ హింజ్.. మొదట్లో బంతిమీద నియంత్రణ లేక ఇబ్బంది పడేవాడు. ఆ తర్వాత విదర్భ క్రికెట్ జట్టుకు మారిపోయిన తర్వాత.. తన బౌలింగ్ శైలి మొత్తం మార్చేసుకున్నాడు. ముఖ్యంగా లో లెవెల్ బౌన్సర్లు వేయడంలో పట్టు సాధించాడు.

సోమవారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ప్రమాదకరమైన ఓపెన్ వైభవ్ సూర్య వంశీ లో బౌన్సర్ వేసి అవుట్ చేశాడు.. ప్రఫుల్ హింజ్ ను హైదరాబాద్ జట్టు యాజమాన్యం 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇటీవల మ్యాచులలో హైదరాబాద్ బౌలర్లు విఫలం కావడంతో ఇన్ని రోజులపాటు రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన ప్రఫుల్ హింజ్ కు అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని ప్రఫుల్ హింజ్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రారంభ మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.. ఇతడి బౌలింగ్లో రాజస్థాన్ జట్టుకు చెందిన ముగ్గురు బ్యాటర్లు 0 పరుగులకు అవుట్ అయ్యారు.. అతడు ఈ స్థాయిలో బౌలింగ్ చేసాడు కాబట్టి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.. అద్భుతమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో.. ఇకపై ఇతడికి హైదరాబాద్ జట్టులో స్థిరంగా అవకాశాలు లభిస్తాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular