spot_img
Homeక్రీడలుక్రికెట్‌Saqib Hussain: ప్రఫుల్ హింజ్ ఉత్పతాన్ని సృష్టిస్తే.. సాకిబ్ హుస్సేన్ భయాన్ని కలిగించాడు.. ఈ బిహారీ...

Saqib Hussain: ప్రఫుల్ హింజ్ ఉత్పతాన్ని సృష్టిస్తే.. సాకిబ్ హుస్సేన్ భయాన్ని కలిగించాడు.. ఈ బిహారీ పేసర్ గురించి ఆసక్తికర విషయాలివి

Saqib Hussain: రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ అద్భుతమైన విజయం సాధించింది.. బ్యాటింగ్లో కెప్టెన్ ఇషాన్ కిషన్ అదరగొడితే.. బౌలింగ్లో ప్రఫుల్ హింజ్ దుమ్మురేపాడు. ఇతడికి సాకీబ్ హుస్సేన్ తోడు కావడంతో రాజస్థాన్ జట్టు ఏ దశలో కూడా గెలుపుకు దరిదాపుల్లో రాలేకపోయింది. ఈ సీజన్లో ఇప్పటివరకు రాజస్థాన్ వరుసగా నాలుగు విజయాల సాధించింది. చెన్నై నుంచి మొదలుపెడితే బెంగళూరు వరకు ఏ జట్టు కూడా రాజస్థాన్ రాయల్స్ ను ఓడించలేకపోయింది.

బ్యాటింగ్లో బలంగా.. బౌలింగ్లో దుర్భేద్యంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు జట్టును సన్ రైజర్స్ బౌలర్లు భయపెట్టారు.. ప్రఫుల్(34/4),సాకిబ్ హుస్సేన్ (24/4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేశారు. ఆరంగేట్ర మ్యాచ్లోనే సంచలనాలు సృష్టించారు.. ప్రఫుల్ ధాటికి వైభవ్ సూర్యవంశీ(0), జూరెల్(0), ప్రిటోరియస్(0), రియాన్ పరాగ్ (4) వంటి ఆటగాళ్లు త్వరగానే పెవిలియన్ చేరుకున్నారు.

హుస్సేన్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ (1), పెరీరా(69), ఆర్చర్ (2), రవి బిష్ణో య్(0) అవుట్ అయ్యారు. ప్రఫుల్ తో సమానంగా నాలుగు వికెట్లు సాధించాడు హుస్సేన్. తద్వారా హుస్సేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.. సాకిబ్ హుస్సేన్ బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ ప్రాంతానికి చెందిన ఆటగాడు. ఇతడి వయసు 21 సంవత్సరాలు.. అన్ క్యాప్డ్ ఆటగాడిగా సన్ రైజర్స్ జట్టులో ఇతడు కొనసాగుతున్నాడు.. హైదరాబాద్ బౌలర్లు క్రితం మ్యాచులలో విఫలం కావడంతో హుస్సేన్ కు అవకాశం లభించింది.

ఐపీఎల్ లో ఆరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లోనే 24 పదవులకు నాలుగు వికెట్లు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ప్రారంభ మ్యాచ్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏడవ బౌలర్ గా హుస్సేన్ రికార్డు సృష్టించాడు. తొలి మ్యాచ్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన అశ్విని కుమార్ అనే బౌలర్ తో సమానంగా కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అల్జారి జోసెఫ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2019లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున ఆడిన జోసెఫ్.. 12 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు.

2017లో ఆర్పీఎస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ లయన్స్ తరఫున అండ్రు టై 17 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.

2008లో కోల్ కతా వేదికగా దక్కన్ చార్జర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా బౌలర్ షోయబ్ అక్తర్ 11 పరుగులకు 4 వికెట్లు తీశాడు.

2012లో జైపూర్ వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ కూపర్ 26 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

2025లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై బౌలర్ అశ్విని కుమార్ 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

2026 లో హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ హుస్సేన్ 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

2015లో బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్ డేవిడ్ 33 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సాధించాడు.

2026 లో హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ 34 పరుగులకు 4 వికెట్లు తీశాడు.

తొలి ఐపిఎల్ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన భారత ప్లేయర్లు

4/24 షాదాబ్ జాకాతి(చెన్నై సూపర్ కింగ్స్) వర్సెస్ డి సి జోహేన్నేస్ బర్గ్, 2009

4/24 అశ్వని కుమార్ (ముంబై ఇండియన్స్) వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్, వాంఖడే స్టేడియం , 2025

4/24 సా కిబ్ హుస్సేన్ ( సన్ రైజర్స్ హైదరాబాద్) , వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్, 2026

4/29 పాల్ వాల్తాటి (పంజాబ్) వర్సెస్ దక్కన్ చార్జర్స్, హైదరాబాద్, 2011

4/34 ప్రఫుల్ హింజ్(సన్ రైజర్స్ హైదరాబాద్) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్, 2026

హుస్సేన్ ను ఐపీఎల్ 2026 వేలంలో హైదరాబాద్ జట్టు ఇతడిని 30 లక్షలకు కొనుగోలు చేసింది. 2024 సీజన్ కు ముందు ఇతడిని కోల్ కతా కొనుగోలు చేసినప్పటికీ ఆడే అవకాశం లభించలేదు. 2022 -23 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరఫున t20 లలో ఎంట్రీ ఇచ్చాడు.

17 సంవత్సరాల వయసులో రెండో మ్యాచులు 20 పరుగులకు నాలుగు వికెట్లు తీశాడు. 2025 -26 రంజి ట్రోఫీలో తన మొదటి 5 వికెట్లను సాధించాడు. ఐపీఎల్ 2026 సీజన్ కంటే ముందు దేశవాళీ క్రికెట్ టోర్నీలో అరుణాచల్ ప్రదేశ్ పై 41 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular