https://oktelugu.com/

PKL Final 2024: ప్రొ కబడ్డీ 2024 : పోయిన సారి రన్నరప్‌.. ఈసారి విన్నర్‌.. హర్యానా స్టీలర్స్‌ గెలుపు వెనుక కథ

ప్రొ కబడ్డీ 2024 సీజన్‌ 11 పోటీలు ముగిశాయి. ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో హర్యానా స్టీలర్స్, పాటాన పైరేట్స్‌ తలపడ్డారు. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో హర్యానా విజయం సాధించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 30, 2024 / 09:08 AM IST

    PKL Final 2024

    Follow us on

    PKL Final 2024: రెండు నెలలుగా దేశంలో జరుగుతున్న ప్రొ కబడ్డీ 2024 సీజన్‌ 11 పోటీలు ముగిశాయి. లీగ్‌ మ్యాచ్‌లు ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే సెమీ ఫైనల్స్‌ ఫైనల్స్‌ ముగిశాయి. ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో హర్యానా స్టీలర్స్, పాట్నా పైరేట్స్‌ తలపడ్డారు. ఉత్కంఠభరితంగా ఫైనల్‌ మ్యాచ్‌ సాగింది. హర్యానా జట్టు సునాయాసంగా విజయం సాధించింది. పాట్నా పైరేట్స్‌పై 32–23 తేడాతో ఘన విజయం సాధించింది. తొలిసారి హర్యానా ఛాంపియన్‌గా నిలిచింది. నాలుగోసారి టైటిల్‌ గెలవాలనుకున్న పాట్నా పైరేట్స్‌ ఆశలపై నీళ్లు చల్లింది. ఫైనల్‌లో హర్యానా అద్భుత ప్రతిభ కనబర్చింది. ఈ మ్యాచ్‌లో హర్యానా తరఫున శివమ్‌ పటారే అత్యధికంగా 9 పాయింట్లు సాధించాడు. మహ్మద్‌ ద్రెజా షాదుల్లా 7 పాయింట్లు సాధించాడు. ఇక పాట్నా పైరేట్స్‌ తరఫున గురుదీప్‌ 6 పాయింట్లు సాధించాడు రెస్ట్‌ దేవాంక్, అయాన్‌ల ఆశలు నెరవేరలేదు.

    డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చిత్తు…
    ప్రొ కబడ్డీ సీజన్‌ 11లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పాట్నా పైరేట్స్‌ చిత్తయింది. ఈ సీజన్‌లో మొదటి నుంచి బాగా ఆడిన హర్యానాకు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా ఆ జట్టు ఆటగాళ్ల దూకుడు ముందు తేలిపోయింది. రెండు జట్ల రైడర్లు రాణించలేకపోయినా డిఫెండర్ల రాణించారు. దీంతో రెండు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఆట మొదలైన 10 నిమిషాల్లోనే హర్యానా 2 పాయింట్లు సాధించింది. తర్వాత అయాన్‌ మల్టీ పాయింట్‌ తీసుకురావడంతో పాట్నా పంజుకున్నట్లు కనిపించింది. దీంతో పోటీ ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్‌లో సగం ఆట అయిపోయే సరికి హర్యానా, పాట్నా 15–12తో నువ్వా నేనా అన్నట్లు కనిపించాయి.

    దితియార్థంలో విఫలం..
    ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన పాట్నా పైరేట్స్‌.. ఆట ద్వితీయార్థంలో వెనుకబడింది. హార్యనా జట్టు ఆధిక్యత ముందు తేలిపోయింది. దీంతో పాట్నా పైరేట్స్‌ డీలా పడ్డారు ఆట మొదలైన తొలి అరగంటలో దేవాంక్‌ కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించాడు. అయాన్‌ 2 పాయింట్లు సాధించాడు. హర్యానా స్టీరల్స్‌కు చెందిన శివమ్‌ పటారే కచ్చితంగా 7 పాయింట్లు సాధించాడు. విఫెన్సలో హర్యానా స్టీలర్స్‌ తరఫున మహ్మద్‌ రెజా షాదుల్లా అద్భుతంగా రాణించాడు. అతడు ట్యాకిల్స్, రైడ్స్‌ రెండింటిలోనూ పాయింట్లు సాధించాడు.

    పాట్నా ఆలౌట్‌..
    ఇక మ్యాచ్‌ ముగియడానికి 8 నిమిషాల ముందు హర్యానా స్టీలర్స్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పాట్నా పైరేట్స్‌ను ఆలౌట్‌ చేసింది. మ్యార్‌లో 9 పాయింట్ల ఆధిక్యం కనబర్చింది. మ్యాచ్‌ ముగియడానికి 5 నిమిషాలకన్నా తక్కువ సమయం ఉండగానే హర్యానా ఆధిక్యం కనబర్చింది. 8 పాయింట్లు ఉండడంతో చివరకు హర్యానా గెలిచింది.