https://oktelugu.com/

PBKS Vs SRH: ఆ సిక్సే మ్యాచ్ ను హైదరాబాద్ వైపు తిప్పింది!

పంజాబ్ పై జరిగిన మ్యాచ్ లో ఒకే ఒక్క సిక్స్ ఆటస్వరూపాన్ని మొత్తం మార్చేసింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో హైదరాబాదు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Written By: , Updated On : April 10, 2024 / 01:01 PM IST
PBKS Vs SRH

PBKS Vs SRH

Follow us on

PBKS Vs SRH: క్రికెట్ అంటేనే సంచలనానికి మారుపేరు.. ఈ క్షణాన ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. ఇక టీ -20 క్రికెట్ అయితే చెప్పే పరిస్థితి ఉండదు.. ఎప్పుడు ఏ బంతి ఎలా తిరుగుతుందో, ఏ వికెట్ ఎప్పుడు పడుతుందో, ఏ బౌలర్ ఎప్పుడు మాయాజాలం ప్రదర్శిస్తాడో, ఏ బ్యాటర్ పూనకం వచ్చినట్టు బ్యాటింగ్ చేస్తాడో? ఏ ఫీల్డర్ ఎప్పుడు అద్భుతం సృష్టిస్తాడో ఎవరూ పసికట్టలేరు. ఇలాంటి అద్భుతాలు మంగళవారం పంజాబ్, హైదరాబాద్ జట్ల మధ్య చాలానే జరిగాయి. చివరి ఓవర్లలో హైదరాబాద్ ఫీల్డర్లు కొన్ని క్యాచ్ లు నేలపాలు చేయడం మినహా.. మ్యాచ్ ప్రారంభంలో కొంతమంది బ్యాటర్లు నిర్లక్ష్యంగా అవుట్ కావడం వంటి వాటిని వదిలేస్తే.. హైదరాబాద్ ఆటగాళ్లు పర్వాలేదు అనే స్థాయిలోనే ఆట తీరు ప్రదర్శించారు.

ఒకే ఒక సిక్స్

పంజాబ్ పై జరిగిన మ్యాచ్ లో ఒకే ఒక్క సిక్స్ ఆటస్వరూపాన్ని మొత్తం మార్చేసింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో హైదరాబాదు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. నితీష్ రెడ్డి ఆడిన ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. ప్రతి తెలుగోడు గర్వాన్ని చాటేలా చేసింది. అద్భుతమైన ఇన్నింగ్స్ తో నితీష్ రెడ్డి ఆడినప్పటికీ.. ఈ మ్యాచ్ చివరిలో హైదరాబాద్ ఆటగాడు జయదేవ్ ఉనాద్కత్ కొట్టిన సిక్సర్ అద్భుతానికి అద్భుతంగా నిలిచింది. అనూహ్య మలుపునకు కారణమైంది. చివరి ఓవర్ చివరి బంతికి జయదేవ్ బ్యాటింగ్ కు వచ్చాడు. వచ్చిన వెంటనే సామ్ కరణ్ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో హైదరాబాద్ స్కోర్ ఒక్కసారిగా 180 పరుగులు దాటింది. హైదరాబాద్ ఈ స్థాయి స్కోరు సాధించడంతో కెప్టెన్ కమిన్స్ ఒక్కసారిగా ఎగిరి గంతేశాడు.. ఎందుకంటే టీ -20 ల్లో ఇదేం తీసి పారేయదగ్గ స్కోర్ కాదు. అయితే ఈ సిక్సే హైదరాబాద్ జట్టును చివర్లో గట్టెక్కించింది.

చివరి 20 ఓవర్ లో పంజాబ్ జట్టు విజయానికి 29 పరుగులు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో జయదేవ్ బౌలింగ్ వేస్తున్నాడు. మొదటి రెండు బంతులను అషు తోష్ శర్మ రెండు సిక్సర్లుగా మలిచాడు. అయితే ఇవి రెండు కూడా బౌండరీ లైన్ వద్ద క్యాచ్ లుగా వచ్చాయి. వాటిని అందుకోవడంలో హైదరాబాద్ ఫీల్డర్లు విఫలమయ్యారు. దీంతో జయదేవ్ ఒక్కసారిగా ఒత్తిడికి గురయ్యాడు. వరుసగా వైడ్ బాల్స్ వేశాడు. చివరి బంతికి శశాంక్ సింగ్ సిక్సర్ కొట్టినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయి. రెండు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. అయితే చివరి బంతికి జయదేవ్ బ్యాటింగ్ కు వచ్చి సిక్సర్ కొట్టకపోతే మ్యాచ్ పంజాబ్ దక్కించుకునేది.

ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 182 రన్స్ చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 37 బంతుల్లో 64 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం పంజాబ్ జట్టు 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడిపోయింది. శశాంక్ సింగ్ 46 నాట్ అవుట్, అషు తోష్ శర్మ 33 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి హైదరాబాద్ ను దాదాపు ఓడించినంత పని చేశారు.