PBKS Vs MI: చెన్నై జట్టుతో ఓటమి తర్వాత ముంబై గట్టి గుణపాఠం నేర్చుకున్నట్టు ఉంది. సోషల్ మీడియాలో విమర్శలు.. అభిమానుల ట్రోల్స్.. దిగ్గజ ఆటగాళ్ల చురకల సెగ బాగానే తగిలినట్టుంది. మొత్తానికి ఆ జట్టు గెలుపు బాట పట్టింది. గురువారం రాత్రి పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 9 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ప్రేక్షకులను సీట్ చివర కూర్చోబెట్టింది. ఈ మ్యాచ్లో జస్ ప్రీత్ బుమ్రా తన యార్కర్ లతో పంజాబ్ ఆటగాళ్ల పై పంజా విసిరాడు. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఈ టోర్నీ హిస్టరీలోనే ఈ ఘనత సాధించిన తొలి పేస్ బౌలర్ గా వినతికెక్కాడు.
ముంబై జుట్టు తరఫున వికెట్లు తీయడంతోపాటు పొదుపుగా బౌలింగ్ వేస్తున్నాడు బుమ్రా. ఆ జట్టు సాధించిన మూడు విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 9 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించడం వెనక తను కూడా ఉన్నాడు. బుమ్రా వేసిన తొలి ఓవర్లో రొసో(1), కెప్టెన్ సామ్ కరణ్(6) ను వెనక్కి పంపించాడు. ఫలితంగా పంజాబ్ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు.
ఈ దశలో పంజాబ్ జట్టు భారాన్ని శశాంక్ సింగ్ తనమీద వేసుకున్నాడు. 25 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్స్ లతో 41 పరుగులు చేశాడు. ఈ దశలో ప్రమాదకరంగా మారిన అతన్ని బుమ్రా అవుట్ చేశాడు. దీంతో పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇలా కీలక మూడు వికెట్లు తీసిన బుమ్రా కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. ఈ పురస్కారంతో బుమ్రా ఐపీఎల్ లో సరికొత్త అధ్యాయం లిఖించాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు అందుకున్న ఉమేష్ యాదవ్ (10) సరసన చేరాడు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించడం ద్వారా బుమ్రా కు ప్లేయర్ ఆఫ్ ది పురస్కారం వచ్చింది. ఇది బుమ్రా కు పదవ పురస్కారం. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన బుమ్రా.. 13 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ముందు వరుసలో ఉన్నాడు. ..ఈ మ్యాచ్లో ముంబై జట్టు 20 ఓవర్ లో ఏడు వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ 57 బంతుల్లో 78 పరుగులు చేసి సత్తా చాటాడు. అనంతరం పంజాబ్ జట్టు 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అషుతోష్ శర్మ 61 పరుగులు చేసి దూకుడుగా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.