Paralympics 2024 : పారిస్ వేదికగా జరుగుతున్న పారాలంపిక్స్ పోటీలలో భారత అథ్లెట్లు ఇప్పటికే 25 మెడల్స్ సాధించారు. పోటీలు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో.. మరికొంతమంది ఆటగాళ్లు మెడల్స్ సాధించేందుకు దగ్గరగా వచ్చారు. పురుషుల హై జంప్ లో ప్రవీణ్ కుమార్ మెడల్ సాధించాడు. మహిళల 200 మీటర్ల T12 విభాగంలో సిమ్రాన్ సెమీ ఫైనల్ చేరింది. ఇప్పటికే పారాలంపిక్స్ భారత్ 25 మెడల్స్ సాధించింది. టోక్యోలో 19 మెడల్స్ మాత్రమే సాధించింది. ఈసారి ఆ సంఖ్యను 65 కు చేర్చింది. శుక్రవారం పురుషుల హై జంప్ T64 విభాగం ఫైనల్ లో టోక్యో లో రజత పతక విజేత ప్రవీణ్ కుమార్ మెడల్ కోసం పోటీ పడనున్నాడు. మహిళల 100 మీటర్ల T12 విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ సిమ్రాన్.. మహిళల 200 T12 విభాగంలో మెడల్ కోసం అమీ తుమీ తేల్చుకొనుంది. సిమ్రాన్ 100 మీటర్ల ఫైనల్ లో 12.31 సెకండ్లలో తన రేస్ పూర్తి చేసింది. ఒకవేళ ఆమె శుక్రవారం రౌండ్ -1, సెమీఫైనల్ లోకి ప్రవేశిస్తే.. భారత బృందానికి మరో మెడల్ వచ్చినట్టే.
అవే కనుక దక్కితే..
పురుషుల జావేలిన్ త్రో లో F54 ఫైనల్లో దీపేష్ కుమార్ సత్తా చాటాడు. మరోవైపు మహిళల F46 విభాగంలో అజబాజి చౌధురి ఫైనల్ లోకి ప్రవేశించింది. పురుషుల షాట్ ఫుట్ ఎఫ్ 57 ఫైనల్ లో సోమన్ రాణా తలపడనున్నాడు.. సోమన్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ప్రపంచ షాట్ ఫుట్ పోటీలలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక పవర్ లిఫ్టింగ్ లో కస్తూరి రాజమణి మహిళల 67 కిలోల విభాగంలో ఫైనల్ చేరింది.. ఇక గురువారం పారా జూడో విభాగంలో భారత జట్టుకు కపిల్ తొలి పతకాన్ని అందించాడు. అతడు దక్కించుకున్న కాంస్యం ద్వారా భారత్ సాధించిన మెడల్స్ సంఖ్య 25 కు చేరుకుంది. అయితే ఈ సంఖ్య 27 కు చేరుకునేదే. రెండు మెడల్స్ తృటిలో చేజారడంతో భారత్ సాధించిన పతకాల సంఖ్య 25 కు చేరుకుంది.. ఆర్చరీలో తొలిసారిగా స్వర్ణం సాధించిన హరివిందర్ సింగ్..మిక్స్ డ్ విభాగంలో పూజతో కలిసి మరో మెడల్ దక్కించుకున్నాడు. అయితే ఫైనల్ లో వారు ఓడిపోవడంతో కాంస్యం తో సరిపెట్టుకున్నారు. కాగా, ఈసారి మెడల్స్ సంఖ్య పెరగడంతో ఆటగాళ్లు సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. పారా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల సోషల్ మీడియాలోనూ ప్రశంసలు లభిస్తున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More