
T20 World Cup 2021: క్రికెట్లో ప్రత్యర్థి జట్టుకు లైఫ్ ఇస్తే ఇక అంతే సంగతి వారి పరాజయం ఖాయమైనట్టే. నవంబర్ 11న పాకిస్తాన్, ఆసిస్ మధ్య జరిగిన మ్యాచ్ లో బౌలర్ హసన్ అలీ జారవిడిచిన క్యాచ్ జట్టు ఫలితాన్నే మార్చేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పరాజయం పాలై ఇంటిముఖం పట్టింది. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్ అద్భుతమైన ప్రదర్శన ఫలితంగా పాక్ ను మట్టికరిపించింది.
దీంతో హసన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కప్ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్న పాక్ కు పాలుపోవడం లేదు. విజయాల పరంపర కొనసాగిస్తుందని భావించిన అభిమానుల గుండెల్లో రాయి పడినట్లు అయింది. హసన్ అలీ క్యాచ్ జారవిడవడంతోనే పాక్ పరాజయం పాలైందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెరుగుతున్నాయి.
ఆస్రేలియాకు చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్లో షాహిన్ ఆఫ్రిదిని బౌలింగ్ కు దించాడు. దీంతో వేడ్ కొట్టిన భారీ బౌండరీ మిస్ ఫైర్ అయింది. బంతి గాల్లోకి లేచి క్యాచ్ గా వెళ్లింది. కానీ దాన్ని హసన్ అలీ జారవిడిచాడు. దీంతో వేడ్ కు లైఫ్ దొరికింది. దీంతో చెలరేగి మూడు బంతులను మూడు సిక్సర్లుగా మలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో హసన్ అలీపై విమర్శల దాడి పెరుగుతోంది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ బాబర్ కూడా హసన్ అలీని తప్పుబట్టి అతడి వల్లే ఓడిపోయామని చెప్పడం గమనార్హం. పాకిస్తాన్ ఓటమికి అలీనే కారణమని నెట్టింట్లో పోస్టులు పెట్టాడు. దీంతో అలీపై పాకిస్తాన్ లో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. అతడు దేశానికి వస్తే కాల్చి పారేయాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఉత్కంఠ రేపుతున్నాయి.
Also Read: విరాట్ కోహ్లీ, రోహిత్ ను కలిసి ఇక ఆడించరా?
భారత్ తరుఫున ఆడుతూ పాకిస్తాన్ కు సపోర్టా? సానియా మీర్జాపై నెటిజన్ల ఫైర్