Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా టీమ్ లా మధ్య జరిగిన ఒక భారీ మ్యాచ్ చాలా ఉత్కంఠ గా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46 ఓవర్ల 4 బంతులకు 270 పరుగులు చేసింది. పాకిస్తాన్ టీం లో ప్లేయర్లు వరుసగా బాబర్ అజమ్ 50 పరుగులు చేశాడు. అలాగే మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులు చేశాడు.అలాగే షకీల్ 52 పరుగులు ,,ఇక షాదాబ్ ఖాన్ 43 పరుగులు ,మహమ్మద్ నవాజ్ 24 పరుగులు చేశారు. వీళ్ళందరూ రాణించి చాలా బాగా బ్యాటింగ్ చేయడంతో పాకిస్థాన్ టీమ్ 46 ఓవర్ 4 బంతులకి 270 పరుగులు చేసింది. ఇక పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ లని కట్టడి చేస్తూ సౌతాఫ్రికా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అందులో ముఖ్యంగా సంషి 4 వికెట్లు తీశాడు. అలాగే మాక్రో జాన్సన్ 3 వికెట్లు తీశాడు,కోట్ జి 2 వికెట్లు తీయగా, లుంగీ ఎంగిడి ఒక వికెట్ తీశాడు…
ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ భారీ స్కోరు చేయడంలో చాలా ఇబ్బంది పడ్డారు.ఇక 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా టీం కి ఓపెనర్లు కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ మంచి ఫామ్ లో ఉన్న డికాక్ 24 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. సౌతాఫ్రికా టీమ్ లో మర్కరం 91 రన్స్ చేసి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడి టీం విజయం సాధించడంలో చాలావరకు కృషి చేశాడు ఈ క్రమంలో తన సెంచరీని మిస్ చేసుకున్నాడు అయిన కూడా ఈ మ్యాచ్ విజయంలో మార్కరం కీలక పాత్ర పోషించాడు అనే చెప్పాలి.
ఆయన లేకపోతే సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లో ఓడిపోయేది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ చివర్లో 260 పరుగుల దగ్గర సౌతాఫ్రికా తన 9వ వికెట్ ని కోల్పోయి పికలోతు కష్టాల్లో పడింది.ఇక ఇంకొక్క వికెట్ ని కనుక తీయగలిగితే పాకిస్తాన్ విజయం సాధిస్తుంది లేదా 11 పరుగులు చేయగలిగితే సౌత్ ఆఫ్రికా విజయం సాధిస్తుంది. ఈ ఉత్కంఠ భరత పోరు లో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ అయిన మహారాజ్ మహమ్మద్ నవాజ్ వేసిన 47వ ఓవర్ రెండో బంతిని మహారాజ్ 4 కొట్టి సౌత్ ఆఫ్రికా టీం కి విజయం అందించాడు. ఇక ఈ విజయంతో సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడితే అందులో ఐదు మ్యాచ్ ల్లో విజయం సాధించి 10 పాయింట్లతో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక ఇండియాకి కూడా 10 పాయింట్స్ ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా కి రన్ రేట్ చాలా ఎక్కువగా ఉండడంతో ఇండియన్ టీం సెకండ్ పొజిషన్ కి వెళ్ళిపోయింది.
ఇక ఈ ఓటమితో పాకిస్తాన్ ఆరు మ్యాచులు ఆడితే అందులో రెండు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించి నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో ఆరోవ ప్లేస్ లో కొనసాగుతుంది. ఇక ఈ ఓటమితో పాకిస్తాన్ వరుసగా 4 మ్యాచ్ ల్లో ఓడిపోయి సెమీస్ బెర్త్ లో నిలబడలేక పోతుంది… మొత్తానికి ఒక ఉత్కంఠ పోరు లో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ చివరి వరకు వచ్చి తమ టీం ని గెలిపించుకొని వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా టీం అద్భుతమైన ఫామ్ లో ఉందని మరోసారి ప్రూవ్ చేశారు…