Homeక్రీడలుPakistan vs New Zealand : 4-0 తో పాకిస్తాన్ ను చిత్తుచిత్తుగా ఓడించేస్తున్న న్యూజిలాండ్

Pakistan vs New Zealand : 4-0 తో పాకిస్తాన్ ను చిత్తుచిత్తుగా ఓడించేస్తున్న న్యూజిలాండ్

Pakistan vs New Zealand : ప్రస్తుతం పాకిస్తాన్ న్యూజిలాండ్ టీమ్ ల మధ్య టి20 సిరీస్ జరుగుతుంది. ఇక ఈ సిరీస్ లో న్యూజిలాండ్ టీమ్ పాకిస్థాన్ ప్లేయర్ల తో పాటు ఆ టీమ్ అభిమానుల గుండెల్లో భయం పుట్టిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు వరుసగా నాలుగు విజయాలను అందుకొని పాకిస్థాన్ టీమ్ ని ఒక బచ్చా టీమ్ లాగా తీసేస్తుంది. ఇక ఇంతకు ముందే ఈ సిరీస్ ని 3-0 తో కైవసం చేసుకున్నా న్యూజిలాండ్ టీమ్ ఇవాళ్టి మ్యాచ్ లో మరోసారి పాకిస్థాన్ టీమ్ ని చిత్తు చేసింది. ఇక ఇవాళ్ళ ఆడిన నాలుగోవ మ్యాచ్ లో పాకిస్తాన్ పరువు కాపాడుకుంటుంది అని అందరూ అనుకున్నారు.

కానీ న్యూజిలాండ్ ప్లేయర్ల దూకుడు కి పాకిస్థాన్ తేలిపోయింది. ఇక ఈ టీమ్ ని చూస్తుంటే వీళ్ళకంటే ఆఫ్గనిస్తాన్ టీమ్ చాలా బెటర్ అనేలా ఉంది. ఎందుకంటే మొన్న ఇండియా మీద జరిగిన మ్యాచ్ లో 212 పరుగుల లక్ష్యాన్ని చేదిస్తు మ్యాచ్ ని టై చేశారు. ఇక సూపర్ ఓవర్ లో ఓడిపోయినప్పటికీ వాళ్ళు చివరి వరకు పోరాడారు. కానీ పాకిస్తాన్ టీమ్ అలా కూడా ఆడటం లేదు. న్యూజిలాండ్ మొత్తం అన్ని మ్యాచ్ లను వన్ సైడ్ చేసేస్తుంది. ఇక ఇవాళ్టి మ్యాచ్ లో మహమ్మద్ రిజ్వన్ ఒక్కడే 90 పరుగులు చేసి కొంతవరకు ఆ టీమ్ భారాన్ని మోసాడు. అయినప్పటికీ పాకిస్తాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు మాత్రమే చేసింది.

న్యూజిలాండ్ ప్లేయర్లు పాకిస్తాన్ బౌలర్ల పైన విరుచుకుపడుతూ తమదైన రీతిలో వరుసగా నాలుగో విజయాన్ని టీమ్ కి అందించారు.ఇక న్యూజిలాండ్ ప్లేయర్లలో డారెల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్ ఇద్దరు హాఫ్ సెంచరీ లు పూర్తిచేసుకొని ఇంకో 11 బంతులు మిగిలి ఉండగానే టీమ్ కి విజయాన్ని అందించారు. న్యూజిలాండ్ టీం లో ఉన్న అడ్వాంటేజ్ ఎంటి అంటే ఆ టీమ్ గెలుపు కోసం ఏ ఒకరి మీద ఆధారపడటం లేదు. ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒకరు చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు.

ఇక మొన్న జరిగిన మూడోవ మ్యాచ్ లో ఫిన్ అలెన్ పాకిస్థాన్ టీమ్ ని తగల బెట్టేసాడనే చెప్పాలి. ఆయన ఒక అద్భుతమైన సెంచరీ చేసి న్యూజిలాండ్ టీమ్ ని గెలిపించాడు. ఇక ఈ రోజు మాత్రం డారెల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి పాకిస్తాన్ ని మరొకసారి చిత్తు చేశాడు. న్యూజిలాండ్ మొదటి నుంచి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది.ఇంకో మ్యాచ్ మిగిలినప్పటికీ సిరీస్ గెలిచి వాళ్ల కాన్ఫిడెంట్ ని చూపించారు. ఇక ఆడబొయే ఆ ఒక్క మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ గెలిచి పాకిస్తాన్ ని క్లీన్ స్వీప్ చేయబోతుందని తెలుస్తుంది…

ఇక ఇది చూసిన వరల్డ్ క్రికెట్ అభిమానులు అందరు కూడా పాకిస్తాన్ టీమ్ ని బాగా ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. మామూలు సమయంలో మా టీమ్ మీద ఏ టీమ్ గెలవదు అని ఎక్స్ ట్రా లు మాట్లాడే పాకిస్తాన్ టీం తీరా సమయానికి వచ్చేసరికి మాత్రం చేతులెత్తేస్తుంది. పాకిస్తాన్ టీమ్ లో క్వాలిటీ లేదు, వాళ్ళ ప్లేయర్లలో కాన్ఫిడెంట్ లేదు. ముఖ్యం గా ప్లేయర్స్ మధ్య సత్సంబంధాలు లేనట్టు గా కనిపిస్తుంది.

ఇక టి20 వరల్డ్ కప్ కు ముందు పాకిస్తాన్ టీం ఇలా ఓడిపోవడం ఆ టీమ్ లోని ప్లేయర్ల కాన్ఫిడెంట్ ని దెబ్బతీస్తుందని పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక న్యూజిలాండ్ టీమ్ మాత్రం అసలు ఎక్కడ తగ్గడం లేదు. బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోనూ తమ సత్తా చూపిస్తూ ఆల్ రౌండర్ ప్లేయర్లు కూడా అద్భుతాలు చేస్తూ వస్తున్నారు. ఇక టి20 వరల్డ్ కప్ లో మన టీమ్ కి గట్టి పోటీ ఇచ్చే టీముల్లో న్యూజిలాండ్ కూడా ఒకటి కాబోతున్నట్లు గా తెలుస్తుంది.

https://www.youtube.com/watch?v=hhVZ5FC3JJ8

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version