Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతీ మ్యాచ్ కీలకమే. కానీ పాకిస్తాన్ జట్టు సమష్టి వైఫల్యంతో ఓటమిని తెచ్చుకుంది. 60 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం ఆ జట్టు సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసింది. 29 సంవత్సరాలు తర్వాత ఐసీసీ టోర్నికి ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ పాకిస్తాన్ ఏ దశలోనూ డిపెండింగ్ ఛాంపియన్ స్థాయిలో ప్రదర్శన చూపలేదు. లీగ్ దశలో పాకిస్తాన్ ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇవి రెండు కూడా బలమైన జట్లతోనే ఆడాల్సి ఉంది. అలాంటప్పుడు పాకిస్తాన్ కచ్చితంగా రెండు మ్యాచ్లలో గెలవాలి. లేకపోతే సెమీస్ అవకాశాలు కోల్పోతుంది..గ్రూప్ – ఏ లో ఉన్న పాకిస్తాన్ తదుపరి మ్యాచ్లలో భారత్, బంగ్లాదేశ్ జట్లతో తలపడుతుంది. ఫిబ్రవరి 23 ఆదివారం నాడు దుబాయ్ వేదికగా భారత జట్టుతో పాకిస్తాన్ తలపడుతుంది. ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్ తో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. పాకిస్తాన్ సెమిస్ చేరాలంటే కచ్చితంగా ఈ రెండు మ్యాచ్లలో గెలవాలి.. అంతేకాదు భారత్ – బంగ్లాదేశ్ రెండు చొప్పున మ్యాచులు ఓడిపోవాలి. అప్పుడే పాకిస్తాన్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉంటాయి. ఫలితంగా గ్రూప్ – ఏ లో టాప్ -2 స్థానంలో చోటు సంపాదించుకుంటుంది. ఒకవేళ భారత్, న్యూజిలాండ్ ఒక్కో మ్యాచ్ లో ఓడిపోతే..నాలుగు పాయింట్లు సాధిస్తే.. అప్పుడు రన్ రేట్ అనేది కీలకమవుతుంది.
మెరుగైన రన్ రేట్ ఉంటేనే..
సెమీస్ వెళ్లాలంటే.. మెరుగైన రన్ రేట్ ను కచ్చితంగా ఆయా జట్లు కొనసాగించాలి. అయితే తొలి మ్యాచ్లో 60 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో రన్ రేట్ నెగిటివ్ అయింది. చివరి రెండు మ్యాచ్లలో పాకిస్తాన్ భారీపరుగుల తేడాతో విజయాలు సాధించాలి. అలాకాకుండా ఒక్క మ్యాచ్ ఓడిపోయినా పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. భారత్ తో జరిగే మ్యాచ్లో పాకిస్థాన్ గెలవడం దాదాపు కష్టం. ఒకరకంగా ఈ మ్యాచ్ రెండు జట్లకు నాకౌట్ లాంటిది. కరాచీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి నాలుగు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. యంగ్ 107, లాథం 118, ఫిలిప్స్ 61 పరుగులు చేశారు.. పాకిస్తాన్ బౌలర్లలో నసీం షా, రౌఫ్ చెరి 2 వికెట్లు సాధించారు. అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం 331 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 47.2 ఓవర్లలో 260 పరుగులకు కుప్ప కూలింది. కుష్ దిల్ షా 69, బాబర్ అజామ్ 64, సల్మాన్ ఆఘా 42 పరుగులు చేశారు. విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు సాధించాడు.. స్మిత్, బ్రేస్ వెల్ తలా ఒక వికెట్ సాధించారు.