Pakistan Vs India: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఉత్కంఠ పరిస్థితులలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యర్థి జట్టు పై చేయి సాధిస్తున్న సమయంలో ఊహించని విధంగా బౌన్స్ బ్యాక్ అయింది. కీలకమైన వికెట్లను వెంటవెంటనే కోల్పోయినప్పటికీ.. మైదానం బౌలింగ్ కు సహకరిస్తున్నప్పటికీ భారత బ్యాటర్లు ఏమాత్రం సమయమనం కోల్పోలేదు. పైగా వీరోచితంగా బ్యాటింగ్ చేశారు.. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అన్ని విధాలుగా గేమ్ ప్లాన్ అమలు చేశారు. టీమిండియా సాధించిన విజయం యావత్ భారత జాతికి మొత్తం ఆనందాన్ని కలిగిస్తోంది..
ఈ ఆనందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ వేదికగా టీం మీడియా సాధించిన విజయాన్ని పురస్కరించుకొని సంచలన ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా యుద్ధంలో గెలిచామని.. ఆసియా కప్ లో విజయం ద్వారా మైదానంలోనూ మరోసారి పై చేయి సాధించామని” నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత టీమిండియా పాకిస్తాన్ జట్టుతో ఐసీసీ నిర్వహించే టోర్నీలలో మాత్రమే ఆడాలని నిర్ణయించుకుంది. అది కూడా తటస్థ వేదికల మీద మాత్రమే ఆడతానని ప్రకటించింది. ప్రధానమంత్రి నిర్ణయం మేరకే బీసీసీఐ ఆ ప్రకటన చేసిందని తెలుస్తోంది. తాజా ఆసియా కప్ లో టీమిండియా సారథి లీగ్ దశలో మ్యాచ్ గెలిచినప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సూపర్ ఫోర్ లో మ్యాచ్ గెలిచినప్పుడు కూడా అలానే వ్యవహరించారు. చివరికి ఫైనల్ మ్యాచ్లో గెలిచినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్లేయర్లను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ అధ్యక్షుడి నుంచి ట్రోఫీ తీసుకోవడానికి కూడా ఆసక్తిని చూపించలేదు. ట్రోఫీ అందివ్వడానికి పోడియం వద్దకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రాగానే.. భారత ప్లేయర్లు మైదానంలోనే సరదాగా గడిపారు. అతడిని ఏమాత్రం లెక్కచేయకుండా నిరసన వ్యక్తం చేశారు..
#OperationSindoor on the games field.
Outcome is the same – India wins!
Congrats to our cricketers.
— Narendra Modi (@narendramodi) September 28, 2025