Pakistan Vs India: “వాడు ఎలాంటి వాడో తెలుసా. ఎలా వస్తాడో తెలుసా.. దెబ్బ మీద దెబ్బ కొట్టాడు.. అవి మామూలు దెబ్బలు కావు.. ఇప్పట్లో మీ నాయన కోలుకోవడం కష్టమే” లెజెండ్ సినిమాలో జగపతిబాబు కొడుకుని ఉద్దేశించి జయ ప్రకాష్ రెడ్డి చెప్పే మాటలు అవి.. ఆ మాటలు ఇప్పుడు పాకిస్తాన్ జట్టుకు అద్భుతంగా సూట్ అవుతాయి. ఎందుకంటే టీమిండియా పాకిస్తాన్ జట్టును కొట్టిన దెబ్బలు అటువంటివి. ఒక దెబ్బను మర్చిపోకముందే మరొక దెబ్బ.. ఇంకో దెబ్బను మర్చిపోకముందే ఇంకొక దెబ్బ అన్నట్టుగా.. మూడు మాస్టర్ స్ట్రోక్ లను ఇవ్వడంతో పాకిస్తాన్ జట్టు బిక్క చచ్చిపోయింది. ఇప్పట్లో ఆ జట్టు కోలుకోవడం కాదు.. మైదానంలోకి అడుగు పెట్టడం కూడా కష్టమే.
లీగ్ దశలో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. దానిని మర్చిపోకముందే సూపర్ 4 లో అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. దీనిని మర్చిపోకముందే ఫైనల్ మ్యాచ్లో అదిరిపోయే స్థాయిలో విజయం సొంతం చేసుకుంది. ఇలా ఒకదాన్ని మించి మరొక మ్యాచ్లో గెలిచి టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ హిస్టరీలోనే సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుంది. వాస్తవానికి ఇలాంటి రికార్డులు సృష్టించడం అంటే మిగతా జట్ల నుంచి అయ్యే పని ఇప్పట్లో కాదు. వాస్తవానికి మైదానంలో టీమ్ ఇండియా ప్లేయర్లు అదరగొడితే.. సోషల్ మీడియాలో బీసీసీఐ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నాలుగో స్ట్రోక్ ఇచ్చింది. టీమిండియా ఫైనల్ మ్యాచ్లో గెలిచిన తర్వాత బీసీసీఐ ఒక సంచలన ట్వీట్ చేసింది.
పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి బీసీసీఐ మూడు ఎదురుదెబ్బలు అని ట్వీట్ చేసింది.. జీరో రెస్పాన్స్.. అన్నట్టుగా ఎగతాళి చేసింది. ఆసియా కప్ చాంపియన్స్ మెసేజ్ డెలివరీ అని స్పష్టం చేసింది. అంతేకాదు భారత జట్టుకు.. సపోర్ట్ స్టాఫ్ కు 21 కోట్ల ప్రైస్ మనీ ప్రకటించింది.. ట్రోఫీ ఇక్కడ ముఖ్యం కాదు.. పాకిస్తాన్ జట్టును ఓడించడమే టార్గెట్ అన్నట్టుగా బీసీసీఐ స్పష్టంగా పేర్కొనడం ఇక్కడ విశేషం. టీం ఇండియా గెలిచిన తర్వాత బీసీసీఐ పెద్దలు.. ఐసీసీ అధ్యక్షుడు జై షా భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ విజయాలు ఇలాగే కొనసాగాలని.. పాకిస్తాన్ జట్టుపై సాధించిన విజయం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
Undefeated ✅
Dominating ✅
Victorious ✅#TeamIndia‘s #AsiaCup2025 campaign was pure mastery pic.twitter.com/kkM1jM7gtD— BCCI (@BCCI) September 29, 2025